హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) కి బీఆర్ఎస్ (BRS) పార్టీ అదనపు భద్రతను కల్పించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల ఆయన చేస్తున్న విమర్శలు, వాటికి కాంగ్రెస్ నేతల కౌంటర్లు, సంభవించే ప్రమాదాల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రభుత్వ భద్రత సరిపోదన్న భావనతో అదనపు ఏర్పాట్లు
ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) కి ప్రభుత్వ పరంగా ఇప్పటికే నలుగురు గన్‌మన్‌లు ఏర్పాటు చేయబడ్డారు. అయితే తాజా పరిణామాల మధ్య బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయనకు అదనంగా మరో 14 మంది ప్రైవేటు గన్‌మన్‌లను నియమించడమే ఈ నిర్ణయానికి కారణమైంది. మొత్తం 18 మంది భద్రతా సిబ్బంది ఆయన రక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ వివాదం: రాజకీయ వేడి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పై పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేయడం ఈ పరిణామాలకు కీలక కారణంగా కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీఎం పై సూటిగా ఆరోపణలు చేయడమే కాకుండా, ఆయన పాలనపై అనేక విషయాల్లో విమర్శలు గుప్పించారు. ఇది కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తికి దారి తీసింది. ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు, ప్రజలు ఉరికించి కొడతారని కూడా కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి పార్టీ తరఫున పెద్ద ఎత్తున సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Jangaon: జనగామ జిల్లాలో గిరిజనుల తాగునీటి సమస్య తీరేదెన్నడు