Municipal elections results : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల అనంతరం మేయర్, చైర్మన్ పదవులపై రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలక కార్పొరేషన్లలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యం సాధించినప్పటికీ, కొన్ని ప్రధాన కార్పొరేషన్లలో ‘హంగ్’ పరిస్థితి నెలకొనడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.
ప్రత్యేకంగా కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో మేయర్ పీఠం ఎవరిదనే ఉత్కంఠ కొనసాగుతోంది. కరీంనగర్‌లో 60 డివిజన్లలో బీజేపీ 30 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ 14, బీఆర్‌ఎస్ 9 స్థానాల్లో గెలిచాయి. నిజామాబాద్‌లో బీజేపీ 28 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14 స్థానాల్లో విజయం సాధించాయి. మెజారిటీకి అవసరమైన సంఖ్య ఏ పార్టీకి రాకపోవడంతో స్వతంత్రులు, మిత్రపక్షాల మద్దతు కీలకంగా మారింది.
Read Also: India vs Pakistan T20 : భారత్‌పై టాస్ గెలిచిన పాక్, మ్యాచ్ ఎవరిది?

స్థానిక సమీకరణాల్లో కాంగ్రెస్ స్వతంత్రులను తనవైపు తిప్పుకోవడంలో సఫలమై, బీఆర్‌ఎస్, ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు పెరిగినట్లు తెలుస్తోంది. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అధికారాన్ని చేపట్టలేకపోవచ్చన్న పరిస్థితి ఆ పార్టీ శ్రేణుల్లో నిరాశకు దారితీసింది.
ఇక కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్, సీపీఐ చెరో 22 స్థానాలు గెలవగా, బీఆర్‌ఎస్ మరియు స్వతంత్రులు 8 చొప్పున స్థానాలు సాధించారు. చర్చల అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను రెండున్నరేళ్ల చొప్పున పంచుకోవాలని కాంగ్రెస్–సీపీఐ మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం తొలి రెండున్నరేళ్లు సీపీఐకి మేయర్ పదవి, అనంతరం కాంగ్రెస్‌కు అవకాశం దక్కనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: