కూతురి హత్య, కొడుకుపై హత్యాయత్నం నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
కరీంనగర్ క్రైమ్: కన్న తండ్రే తన పిల్లలకు కాలయముడయ్యాడు. వైకల్యం కలిగిన పిల్లల్ని భారంగా భావించి, వారిని అంతం చేయడానికి ప్రయత్నించిన నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కరీంనగర్ త్రీ (Karimnagar Crime) టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన హత్య, హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు అనవేణి మల్లేష్ (38) ను పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఈ ఘాతుకంలో కూతురు ప్రాణం కోల్పోగా, కొడుకు ప్రాణాపాయస్థితి నుంచి తప్పించుకోగలిగాడు.
Read Also: IMEI Number: మొబైల్ IMEI నంబర్ ట్యాంపరింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు

పిల్లల వైకల్యం, వైద్యుల నిర్ధారణ
నిందితుడు అనవేణి మల్లేష్‌కు, ఆయన భార్య పోశవ్వకు హర్షిత్ (కొడుకు), హర్షిత (కూతురు) అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. దురదృష్టవశాత్తు, ఆ ఇద్దరు పిల్లలు చిన్న వయస్సులోనే మానసిక, శారీరక అంగవైకల్యంతో బాధపడుతున్నారు. వైద్య చికిత్స కోసం నిలోఫర్, ఉస్మానియా, (Osmania) నిమ్స్ వంటి అనేక ఆసుపత్రుల్లో చూపించినా, పిల్లల పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. స్విమ్స్ వైద్యులు పిల్లల పరిస్థితి జీవితాంతం మారదని స్పష్టం చేయడంతో నిందితుడు తీవ్ర మానసిక ఆందోళనకు గురై ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
హత్యాయత్నం, హత్య
ఈ నెల 15న మధ్యాహ్నం నిందితుడి భార్య మార్కెట్‌కు వెళ్లిన సమయంలో, మల్లేష్ మొదట కూల్‌డ్రింక్‌లో (Cool drink) పురుగుల మందు కలిపి పిల్లలకు ఇవ్వడానికి ప్రయత్నించగా, వారు నిరాకరించడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. అనంతరం, నిందితుడు ఒక కాటన్ టవల్‌ను రెండు ముక్కలుగా చేసి, వాటిని ఉపయోగించి కూతురు హర్షిత, కొడుకు హర్షిత్ మెడకు ఉరి వేసినట్లు విచారణలో అంగీకరించాడు. ఈ ఘటనలో కూతురు మరణించగా, కొడుకుపై హత్యాయత్నం జరిగింది. హత్య అనంతరం నిందితుడు టవల్ ముక్కలను బయట పారవేసి ఇంటినుంచి పరారయ్యాడు. మూడు రోజులపాటు తప్పించుకు తిరిగిన నిందితుడు మంచిర్యాల వెళ్లే దారిలో కరీంనగర్ బస్టాండ్‌లో పట్టుబడ్డాడు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: