ఈ నెల 7న భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో నిర్వహించనున్న కేటీఆర్ (KTR) సభను విజయవంతం చేయాలని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు (Kantharao) పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు ఉపసర్పంచులు వార్డు సభ్యులకు నిర్వహించనున్న సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్న నేపథ్యంలో ఈ సభను ఘనంగా నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని రేగా కాంతారావు కోరారు.
Read also: Kavitha: హరీష్ రావు గుంపు ఏర్పాటుపై కవిత సంచలన వ్యాఖ్యలు

పంచాయతీ ఎన్నికల్లో (Kantharao) మనం అనుకున్న దానికంటే ఎక్కువ వస్తానని సర్పంచులుగా గెలుచుకున్నామని, అని అది జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ మాలో వర్గ పోరు వల్లే మాకు తక్కువ స్థానాలు వచ్చాయని ప్రచారం చేసుకుంటున్నారని అది ముమ్మాటికి అసత్యమన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రతి గ్రామంలో కార్యకర్తలు బలమైన కేడర్ ఉందని అన్నారు. అదే స్ఫూర్తితో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్నారు. కొత్తగూడెం, ఇల్లందు, అశ్వరావుపేట మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: