Kamareddy suicide : కామారెడ్డి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. భార్య, ముగ్గురు కుమార్తెలు మరియు గర్భంతో ఉన్న భార్యను పోషించలేక మానసిక ఒత్తిడికి లోనైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వివరాల్లోకి వెళ్తే, బీర్కూర్ మండలం వీరాపూర్ దుబ్బాకు చెందిన ప్రహ్లాద్ (30) అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన సౌందర్యతో దశాబ్దం క్రితం వివాహం జరిగింది. వీరికి స్నేహ (8), హర్షిత (6), వసుంధర (4) అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రహ్లాద్ రోజువారీ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారనే ఆందోళనతో, (Kamareddy suicide) వారిని ఎలా చదివించాలి, భవిష్యత్తులో ఎలా పెళ్లిళ్లు చేయాలి అన్న భయంతో ప్రహ్లాద్ తరచూ తీవ్రంగా ఆలోచిస్తూ ఉండేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం భార్య సౌందర్య తొమ్మిది నెలల గర్భిణిగా ఉండగా, జనవరి 26లోపు డెలివరీ జరగాల్సి ఉంది. నాలుగో సంతానం కూడా కూతురే పుడుతుందనే అనుమానంతో ప్రహ్లాద్ మరింత కుంగిపోయినట్లు తెలుస్తోంది.
Read also: Nizamabad Crime: అప్పు ఎగ్గొట్టేందుకు మాస్టర్ ప్లాన్.. అసలేం జరిగింది?
ఈ మానసిక ఒత్తిడితో శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యుల ముందే విషం తాగాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తీసుకెళ్లినా, అదే రోజు రాత్రి చికిత్స పొందుతూ ప్రహ్లాద్ మృతి చెందాడు.
ఆదివారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గతంలో కూడా ప్రహ్లాద్ మూడు సార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పట్లో కుటుంబ సభ్యులే అతడిని కాపాడారని వాపోయారు. ఈ ఘటన గ్రామంలో విషాదఛాయలు అలుముకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: