హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ పునరుద్ధరణపై ఆశలు చిగురిస్తున్నాయి. మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం సుందిళ్ళ బ్యారేజిలకు బుంగలు పడటంతో ఇన్నాళ్ళు ప్రాజెక్టు భవితవ్యంపై తెలంగాణ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. మేడిగడ్డ బ్యారేజిని పునరుద్ధరణకు రూర్కీ ఐఐటి సౌజన్యంతో సొంత డబ్బులు వెచ్చించి మరమ్మతు చేపడుతామని ఆ బ్యారేజి నిర్మాణ సంస్థ ముందుకు వచ్చినా జాతీయ ఆనకట్టల భద్రతా ప్రాధికార సంస్థ విముఖత వ్యక్తం చేసింది. బ్యారెజ్ డిజైన్ల విషయంలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(Central Design Organization) (సిడిఎస్) తీరును కూడా జాతీయ ఆనకట్టల భద్రతా ప్రాధికారసంస్థ వ్యవహారశైలిని కూడా ఎన్డీఎస్ఏ తన తుదినివేదికలో తీవ్రంగా అభిశంసించింది.
Read Also: FASTAG: ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చివరకు సిడివోతోనే బ్యారేజి పునరుద్ధరణ చేయడానికి ముందుకు వచ్చినా తమకు తగినంత అనుభవంలేదని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చేతులు ఎత్తేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజు పునరుద్ధరణ పనులకు సంబంధించి డిజైన్లను సమకూర్చేందుకు అనుభవమున్న ఏజెన్సీల నుంచి దరఖాస్తుల స్వీకరణను ప్రభుత్వం ప్రారంభించడంతో వందలాది కోట్లతో కట్టిన నిర్మాణాలు ఇక వృధాకావని భరోసా తెలంగాణ ప్రజలలో నింపుతూ ఒక శుభసంకేతంను ప్రభుత్వం పంపింది.. మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్ లోని 20 పిల్లర్ రెండేళ్ళ క్రితం కుంగిపోయింది.
దానిపై ఎన్డీఎసీ ఇప్పటికే పూర్తిస్థాయి నివేదికను సమర్పించింది. అంతేకాదు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ పటిష్టతకు చేపట్టాల్సిన తదుపరి చర్యలను ఇరిగేషన్ శాఖకు వివిధ రకాలైన సిఫారసులు చేసింది. ఎన్డీఎస్ఎ సూచనలను అనుసరిస్తూ బరాజ్ నిర్మాణంలో, పునరుద్ధరణ పనుల్లో అనుభవమున్న ఏజెన్సీలను కన్సల్టెన్సీగా ఏర్పాటు చేసుకోవాలని సర్కారు నిర్ణయించింది. అందులో భాగంగా బుధవారం నోటిఫికేషన్ను(Notification) జారీ చేసింది. ఎన్డీఎస్ఏ సిఫారసులు మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ పునరుద్ధరణ పనులకు డిజైన్లను సమకూర్చేందుకు
అనుభవం, ఆసక్తి ఉన్న ఏజెన్సీలు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
బ్యారేజిల పటిష్టతపై మదింపు, హైడ్రాలజీ, హైడ్రాలిక్ రివ్యూ, వరదలు, భూకంపాలు వంటి విపత్తులను ఎదుర్కోవడంలో బ్యారేజిల ఉన్న సామర్థం మదింపు చేయడంతో మరమ్మతు వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వ్యక్తీకరణ చేయాల్సి ఉంటుంది. గేట్లు, పియర్లు, స్టిల్లింగ్ బేసిన్, కటాఫ్ వాల్స్ వంటి బ్యారేజిలోని కీలక విభాగా లను పటిష్టం చేసేందుకు డిజైన్లు అందించడం వంటి సేవలపై ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ను 15వ తేదీ నాటికి ఏజన్సీలు ని వెల్లడించాలని, వివరాలకు ఇరిగేషన్ కార్యాలయంలో నేరుగా సంప్రదించాలని తెలిపింది.
ఎంపికైన సంస్థ అందించే డిజైన్లు, డ్రాయింగ్స్కు కేంద్ర జల సంఘం ఆమోదం తెలపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరమ్మతుకు ఆసక్తి చూపే కంపెనీ గత 15 ఏళ్లలో కనీసం ఒకటి రెండు ప్రాజెక్టుల పునరుద్ధరణ కోసం ఇలాంటి పనులు చేసి ఉండాలంటూ అర్హతలను నిర్దేశించింది. ప్రస్తుత బ్యారేజిలోని డిజైన్తో పాటు ఎన్డీఎస్ఎ నివేదికల్లోనిసిఫారసులకు అనుగుణంగా మరమ్మతులు చేపడితే భవిష్యత్లో గోదావరి నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి జియోటెక్నికల్, జియోఫిజికల్ వంటి పరీక్షలు నిర్వహించి దానికి అనుగుణంగా బ్యారేజిని పటిష్టపరిస్తే మిగితా ప్రాజెక్టుల వలె అది కూడా బలోపేతంగా తయావు తుందని ప్రజలు ఆశిస్తున్నారు. డైమాండ్ కట్టింగ్ అను సరించి బ్యారేజిలోని ఏడవ బ్లాక్నుపూర్తిగా తొలగించే అవకాశాలు కూడా చర్చించే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: