Kadiyam Srihari-KCR: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని కేసీఆర్ ఇంకా ఎన్ని రోజులు రాజకీయం చేస్తారని ఆయన నిలదీశారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినప్పటికీ, ఇంకా పాత అంశాలనే వాడుకుని రాజకీయ ప్రయోజనం పొందాలని చూడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: Doctorate to Kinnera Mogulaiah : డాక్టరేట్ అందుకున్న పద్మశ్రీ కిన్నెర మొగులయ్య
సెంటిమెంట్‌తో ఇంకెన్నాళ్లు?
కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దేశానికి జాతిపిత ఒకరేనని, అది మహాత్మాగాంధీ అని అన్నారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ జాతిపిత ఎలా అయ్యారని ప్రశ్నించారు. జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

జాతిపిత అయితే ప్రజల్లోకి వచ్చి సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.కేసీఆర్ తన హయాంలో అవకతవకలు, అక్రమాలు చేసి కుంభకోణాలలో ఇరుక్కున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే అది కూలిపోయిందని, రాష్ట్రాన్ని దివాలా తీయించారని అన్నారు. ప్రజలు అధికారం నుంచి దింపినా వారికి ఇంకా అహంకారం తగ్గలేదని విమర్శించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: