తెలంగాణ రాష్ట్రంలో నూతన లోకాయుక్త నియామకం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ రాజశేఖర్ రెడ్డిని తెలంగాణ లోకాయుక్తగా నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన అనుభవం, న్యాయవ్యవస్థపై అవగాహన ఉన్న వ్యక్తిగా లోకాయుక్త పదవికి ఎంపిక కావడం రాష్ట్రపాలనలో పారదర్శకతను తీసుకురావడంలో కీలకంగా భావిస్తున్నారు.
లోకాయుక్తగా బీఎన్ జగ్జీవన్ కుమార్
ఇదే సందర్భంలో ఉప లోకాయుక్తగా బీఎన్ జగ్జీవన్ కుమార్ నియామకమయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ విధానాల అమలులో ప్రజలకు న్యాయం చేకూర్చేలా లోకాయుక్త వ్యవస్థ పటిష్టంగా కొనసాగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అధికారులు, ప్రజా ప్రతినిధులపై వచ్చిన ఫిర్యాదులను నిష్పక్షపాతంగా విచారించే బాధ్యత ఈ నియామకాల ద్వారా మరింత బలపడనుంది.

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (HRC) ఛైర్మన్‌గా జస్టిస్ షమీమ్ అక్తర్
అదనంగా, తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (HRC) ఛైర్మన్‌గా జస్టిస్ షమీమ్ అక్తర్ నియమితులయ్యారు. అలాగే, కమిషన్ సభ్యులుగా శివాడి ప్రవీణ్ మరియు బి. కిశోరు నియమితులయ్యారు. ఈ నియామకాల ద్వారా రాష్ట్రంలో మానవ హక్కుల పరిరక్షణకు మరింత దృష్టి సారించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టినట్లు స్పష్టమవుతోంది.