हिन्दी | Epaper
తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

Telugu News: Jupally Krishna Rao-ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనే యోచన కెటిఆర్ ది

Pooja
Telugu News: Jupally Krishna Rao-ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనే యోచన కెటిఆర్ ది

Jupally Krishna Rao: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని ఆలోచన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ దే అని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో(Press conference) మాట్లాడుతూ, 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం నేడో, రేపో కూలిపోతుందని కేటీఆర్ అన్నారనీ, దానిపై ఆయన స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలకు “సిగ్గు ఉందా?” అని అడిగిన కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

Jupally Krishna Rao

తెలంగాణ కోసం చేసిన త్యాగాలపై విమర్శ

తెలంగాణ రాష్ట్రం(Telangana State) కోసం వందలాది మంది యువకులు ప్రాణత్యాగం చేసినా, అమరుల ఆశయాలకు అనుగుణంగా ఒక్క పని కూడా చేయలేదని జూపల్లి అన్నారు. బదులుగా అమరుల ఆత్మలకు తూట్లు పొడిచే పనులు ఎన్నో చేశారని ఆరోపించారు.

చెప్పులు మోసిన సంతోష్‌రావుకు ఎంపీ పదవి ఇచ్చినప్పుడు ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. వేల కోట్లు అక్రమార్జన చేశారని కవితే చెప్పిందని, ఆమె అబద్ధం చెప్పలేదని పేర్కొన్నారు. కవిత, కేటీఆర్ ఇద్దరూ ఒకటేనని, కెసిఆర్ కుటుంబమంతా ఒకే ముక్క అని వ్యాఖ్యానించారు.

అప్పుల కుప్పగా మారిన తెలంగాణ

తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినందుకు కేటీఆర్ సిగ్గుపడాలని జూపల్లి అన్నారు. వాస్తవాలు మాట్లాడితే వాటిని వక్రీకరించి బూతులుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ లేదా సుప్రీంకోర్టు ఆదేశాల(Supreme Court orders) ప్రకారమే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి విషయానికి ఒక సమయం, సందర్భం ఉంటుందని, కేటీఆర్ వాస్తవాలకు, బూతులకు తేడా తెలియని వ్యక్తి అని ఆయన తీవ్రంగా విమర్శించారు.

నా మాటలను వక్రీకరించారు: జూపల్లి

ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పోటీ చేసిన సందర్భంలో ఎవరు గెలుస్తారో తెలియదని, గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో ముందుగా చెప్పలేమని అన్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను నెరవేర్చగలమో లేదో అనిశ్చితి ఉంటుందని చెప్పారు. అందువల్ల తాను ఎటువంటి హామీలు ఇవ్వనని, కానీ నిజాయితీగా కష్టపడి పని చేస్తానని మాత్రమే ప్రజలకు హామీ ఇస్తానని స్పష్టం చేశారు. అందుకే ఏడు సార్లు పోటీ చేస్తే ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని జూపల్లి కృష్ణారావు గుర్తు చేశారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు కేటీఆర్‌పై ఏ ఆరోపణలు చేశారు?
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని కేటీఆర్ ఆలోచిస్తున్నారని, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించారని ఆయన ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏ సమస్యతో ముడిపెట్టారు?
తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మంత్రి జూపల్లి విమర్శించారు.

Read Hindi News: hindi.vaartha.com

Read also :

https://vaartha.com/g-t-jeevan-focus-should-be-on-strengthening-government-sector-institutions/telangana/546345/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870