పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు
హైదరాబాద్: హైకోర్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ , మాజీ మంత్రి హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషన్‌పై ఇరువైపుల వాదనలను ముగించిన ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది.

జిల్లా కోర్టుకు పరిధి లేకుండా ఉత్తర్వులు
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి జిల్లా కోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరిస్తూ జిల్లా కోర్టు కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసులు జారీ చేసింది. జిల్లా కోర్టుకు పరిధి లేకుండా ఉత్తర్వులు జారీ చేసిందంటూ వారిద్దరూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తీర్పు రిజర్వు
ఇటీవల ఫిర్యాదుదారు రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. ఫిర్యాదుదారు మృతి చెందితే పిటిషన్‌కు విచారణార్హత ఏ విధంగా ఉంటుందని హైకోర్టు ప్రశ్నించింది. ఫిర్యాదుదారు మృతిచెందినా పిటిషన్‌ను విచారించవచ్చని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కోర్టు పరిధిలేకుండా ఉత్తర్వులు జారీ చేసిందని కేసీఆర్, హరీశ్‌రావు తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. తీర్పును రిజర్వు చేసింది.