జూబ్లీహిల్స్(Jubilee Hills) అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కానున్నందున, ఓటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ తెలిపారు. మొత్తం 4 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా, ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు 58 మంది పోటీదారులు రంగంలో ఉన్నారు. ఈసారి ఓటింగ్ శాతం 50 దాటేలా ప్రతి ఓటరును తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు.
మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన స్థానం భర్తీకి ఈ ఉపఎన్నిక నిర్వహించబడుతోంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని కర్ణన్ తెలిపారు. హైదరాబాద్ అదనపు పోలీసు కమిషనర్ ఇక్బాల్‌తో కలిసి పోలింగ్(polling) ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆయన, ఓటర్లు ప్రశాంతంగా, నిబంధనలు పాటిస్తూ ఓటు వేయాలని సూచించారు.
Read Also: Ande sri:అందెశ్రీ కన్నుమూతపై సీఎం రేవంత్, కేసీఆర్ దిగ్భ్రాంతి

జూబ్లీహిల్స్‌లో(Jubilee Hills) ఇంతవరకు పోలింగ్ శాతం 50 దాటలేదని, ఈసారి ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటర్లు ఓటరు స్లిప్పులతో కాకుండా గుర్తింపు కార్డులతో రావాలని సూచించారు. అనుమానాస్పద ఓటర్ల వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇస్తామని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 103 మంది వృద్ధులు ముందస్తుగా ఓటు వేసినట్లు కూడా చెప్పారు.
భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం
ఉపఎన్నిక ప్రశాంతంగా సాగేందుకు పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించినట్లు అదనపు సీపీ ఇక్బాల్ తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో పారా మిలటరీ దళాలను నియమించగా, 230 మంది రౌడీషీటర్లను ఇప్పటికే బైండోవర్ చేసినట్లు ఆయన వివరించారు. మొత్తం 1,761 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారని చెప్పారు. ఇప్పటివరకు తనిఖీల్లో రూ.3.60 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని, 27 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: