నామినేషన్లు & తేదీలు:
హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు(Jubilee Hills Election) ఎన్నికల సంఘం నోటిఫికేషన్ అక్టోబర్ 13న విడుదల చేస్తోంది. నామినేషన్లను అక్టోబర్ 13 నుంచి 21 వరకు (ప్రభుత్వ సెలవులు మినహా) రిటర్నింగ్ ఆఫీస్‌లో సమర్పించవచ్చు. అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 24న ఉపసంహరణ మరియు తుది జాబితా ప్రకటించడం జరుగుతుంది. నవంబర్ 11న ఉప ఎన్నిక, నవంబర్ 14న ఓట్లు లెక్కించబడతాయి.
Read also: Polio Death: సంగారెడ్డి లో పోలియో చుక్కల తరువాత చిన్నారి మరణం

డిజిటల్ & ఆన్‌లైన్ నామినేషన్లు
ఎన్నికల(Jubliee Hills Election) సంఘం ENCORE పోర్టల్ ద్వారా డిజిటల్ నామినేషన్ సమర్పణకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు https://encore.eci.gov.in ద్వారా నామినేషన్ ఫారం ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. అయితే, QR కోడ్‌తో కూడిన ప్రింటెడ్ హార్డ్ కాపీ తప్పనిసరిగా సమర్పించాలి. డిపాజిట్ బ్యాంక్/ట్రెజరీలో క్రెడిట్ అయినా, మాన్యువల్ డిపాజిట్ కూడా చేయవచ్చు.
ఓటర్లు & పోలింగ్ సౌకర్యాలు
జూబ్లీహిల్స్(Jubilee Hills Election) అసెంబ్లీ నియోజకవర్గంలో(Jubilee Hills Assembly constituency) మొత్తం 3,98,982 ఓటర్లు ఉన్నారు, అందులో పురుషులు 2,07,367, మహిళలు 1,91,590, ఇతరులు 25 మంది. 80 ఏండ్లకు పైబడిన వృద్ధుల్లో పురుషులు 3,280, మహిళలు 2,772 మంది. ఎన్ఆర్ఐ ఓటర్లు 95, సర్వీస్ ఎలక్టోరల్స్ 18, పీడబ్ల్యూడీ ఓటర్లు 1,891 మంది. నియోజకర్గంలో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఏ రోజు?
అక్టోబర్ 13, 2025.
నామినేషన్లు ఎక్కడ సమర్పించాలి?
షేక్ పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీస్‌లో.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: