
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు(Jubilee Hills by-election) జరుగుతున్న విషయం విధితమే. ఈ సందర్భంగా ఆటో యూనియన్ డ్రైవర్లు ఓటర్లకు మంచి ఆఫర్ ను ఇచ్చారు. వృద్ధులు, వికలాంగులు, బాలింతలు, చిన్న పిల్లలతో వెళ్లే వారికి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రం వరకు ప్రీగా దించనున్నట్లు ఆటో యూనియన్ నాయకులు తెలిపారు. ఉదయం ఎన్నికలుమొదలైన సమయం నుంచి సాయంత్రం ఎన్నిక ముగిసే వరకు 200 ఆటోలలో ఫ్రీగా పోలింగ్ కేంద్రాల వరకు తీసుకెళ్తామని, ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆటో యూనియన్ డ్రైవర్లు పేర్కొన్నారు.
Read also: ఢిల్లీ పేలుడు లో 12కు చేరిన మృతుల సంఖ్య

నేతలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో(Jubilee Hills by-election) విజయం సాధించాలనే దృఢసంకల్పంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శక్తివంతమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. చివరి ఓటు పడేవరకు ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి(Revanth Reddy) నేతలకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో ఒక్కసీటు కూడా గెలవని కాంగ్రెస్, ఈసారి జూబ్లీహిల్స్ లో ఏకైక విజయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత, పార్టీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సీటు గెలిస్తే నగరంలో కాంగ్రెస్ బలం పెరుగుతుందని నేతలు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: