జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-election) బీజేపీ అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు చివరికి తెరపడింది. చాలా రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదిస్తూ, బీజేపీ హైకమాండ్ అధికారికంగా తమ అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి (Lanka Deepak Reddy) ఈ ఎన్నికల్లో కమలం తరఫున బరిలోకి దిగనున్నారు. దీని ద్వారా జూబ్లీహిల్స్‌లో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది.
Read Also: Polavaram: కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
ఇప్పటికే ఈ స్థానం కోసం పలువురు ప్రముఖ నేతల పేర్లు చర్చలోకి వచ్చాయి. వీరపనేని పద్మ, విక్రమ్ గౌడ్, జూటూరు కీర్తిరెడ్డి వంటి నాయకులు ఈ సీటు కోసం ఆసక్తి చూపారు. అయితే, పార్టీ అంతర్గత చర్చలు, స్థానిక సమీకరణాలు, అభ్యర్థి సామాజిక నేపథ్యం, ప్రజాదరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత లంకల దీపక్ రెడ్డినే ఫైనల్ చేశారు.

పార్టీ నిర్ణయం ప్రకారం, దీపక్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే బీజేపీ, ఈ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-election) బలమైన పోరాటాన్ని ఇవ్వనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక బీఆర్ఎస్ (BRS) నుంచి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీత, కాంగ్రెస్ (Congress) నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మూడు పార్టీలు అభ్యర్థులను ప్రకటించటంతో ప్రచారం ఉపందుకోనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: