Jogu Ramanna arrest : అదిలాబాద్, జనవరి 6 రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చిన అదిలాబాద్ బంద్‌లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ డిపో ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టైర్ దహనం చేస్తూ ఆయన ఆందోళనకు దిగారు.
నిరసన సమయంలో జోగు రామన్నకు పోలీసు అధికారులతో వాగ్వాదం చోటుచేసుకుంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని, యూరియా కొరత తీవ్రంగా ఉందని, రంగు మారిన సోయాబీన్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Read also: AP: త్వరలో అన్ని విషయాలు మాట్లాడతా: సీఎం చంద్రబాబు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతుల (Jogu Ramanna arrest) సమస్యలను పరిష్కరించాలని జోగు రామన్న కోరారు. రైతుల సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం డిపో డీఎంతో చర్చలు ఫలించకపోవడంతో డీఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జోగు రామన్నతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: