పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనుసరిస్తున్న వైఖరిపై బీఆర్‌ఎస్ పార్టీ(BRS Party) భగ్గుమంది. ఈ విధానాలను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు బీజేపీ ఎంపీ నగేశ్ ఇంటిని ముట్టడించారు. ఈ నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also : Mrityunjay Tiwari : ఎన్డీయే నాయకులు పగటి కలలు కంటున్నారు : తివారి

బీఆర్‌ఎస్ నిరసన, ఉద్రిక్తత
మాజీ మంత్రి జోగు రామన్న(Joggu Ramanna) ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎంపీ నగేశ్ నివాసం ముందు బైఠాయించి సీసీఐ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా, బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం మాజీ మంత్రితో పాటు ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రైతుల డిమాండ్లు, కేంద్రంపై ఆరోపణలు
ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ, తేమ పేరు చెప్పి పత్తి కొనుగోళ్లను సీసీఐ నిరాకరిస్తూ రైతులను తీవ్రంగా నష్టపరుస్తోందని మండిపడ్డారు.
- కొనుగోలు పరిమితి: తేమతో సంబంధం లేకుండా పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎకరాకు 7 క్వింటాళ్లు కాకుండా, 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.
- కేంద్రంపై ఆరోపణ: విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తిపై సుంకం తగ్గించి, దేశీయ రైతులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని జోగు రామన్న ఆరోపించారు.
- ఆందోళన హెచ్చరిక: రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :