సిద్దిపేట : నేటికి అత్యధిక జనాభా గ్రామీణ ప్రాంతాలలోనే నివసిస్తున్నారని గ్రామాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం దేశం ఆరోగ్యంగా ఉంటుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ వర్మ అన్నారు. సిద్ధిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా మంత్రి పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 276 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకు, ఇందిరా మహిళా శక్తి విజయోజవత్స సంబరాలలో భాగంగా మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు రూ.28.95 కోట్ల చెక్కులను మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, కొండా సురేఖతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Deva Varma) మాట్లాడుతూ ప్లాస్టిక్ ఉంటే పరిసరాలు పచ్చదనంగా ఉండవన్నారు. ప్రతి మహిళ నాయకురాలుగా ఎదగాలన్నారు. సెల్ప్ హెల్ప్ గ్రూప్ అంటే కేవలం ఒక చిన్న గ్రూప్ కాదని అధిక విప్లవం, భారత దేశ మహిళా శక్తి విప్లవం అన్నారు.
మహిళల శక్తి సామర్థ్యాలు చూశానని
ఎసీవ్జిని ఒక చిన్న సంస్థగా పరిణించకండి ఆది ఒక ఉద్యమం అన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణలో ఊపందుకుంటుందన్నారు. నేను సిఎం రేవంత్రెడ్డి జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడ మహిళల శక్తి సామర్థ్యాలు చూశానని పేర్కొ న్నారు. మానవ సేవ చేయాలని సంకల్పించినప్పుడు ఆదొక ఉద్యమంగా మారుతుందన్నారు. మానవ సేవ చేసే అవకాశాలు జీవితంలో అరుదుగా వస్తాయన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ (Ponnam Prabhakar Goud) రాజ్ భవన్లో స్టీల్ బ్యాంకుపై చెప్పినప్పుడు చాలా నచ్చిందన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ను దూరంగా పెడితేనే అందరం ఆరోగ్యంగా ఉంటామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, ఆటవీశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. పర్యావరణ మంత్రి ప్లాస్టిక్పై అవగాహన కల్పిస్తూ రోడ్ల మీద ఎక్కడ చెత్త లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ను దూరం పెట్టేలా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్టీల్ బ్యాంక్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయమన్నారు.

Jishnu Dev Varma: గ్రామాలు ఆరోగ్యంగా ఉంటేనే దేశానికి ఆరోగ్యం : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ఎవరు అనారోగ్యం బారిన పడొద్దనే స్టీల్ బ్యాంక్ పంపిణీ : మంత్రి పొన్నం
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎవరు ఆనారోగ్యం బారిన పడ కుండా ఉండాలని స్టీల్ బ్యాంక్ పంపిణీ కార్యక్రమం చేపట్టానని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. ప్లాస్టిక్ విని యోగాన్ని దూరం పెడితే ఆనారోగ్యా లను దూరం పెటినట్లేనని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం మంచి కాదని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు చూపిస్తున్నామన్నారు. ఎక్కడికి వెళ్లినా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి పైనే నాదృష్టి ఉంటుం దన్నారు. నియోజకవర్గంలో 160 గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామాలకు స్టీల్ బ్యాంకు పంపిణీ (Distribution of steel bank) చేయడం జరుగుతుందన్నారు. గవర్నర్ రాజా కుటుంబం నుంచి వచ్చిన అలా ప్రదర్శించారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సేర్చ్ సీఈవో దానకిషోర్, కలెక్టర్ హైమావతి, జిల్లా అదనపు కలెక్టర్ గరిమా ఆగ్రవాల్, ఆర్టీఓ రామ్మూర్తి, దివ్యా దేవరాజన్, పమేలా సత్పతి స్నేహ శబరిష్, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ మంత్రులు, మొక్కలు నాటారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎవరు?
జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన త్రిపుర రాయల కుటుంబానికి చెందినవారు.రాజకీయంగా విశేష అనుభవం కలిగిన నాయకుడు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏ రాష్ట్రానికి చెందినవారు?
జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రాష్ట్రానికి చెందినవారు. ఆయన త్రిపురలో రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: TG EAPCET: నేడు ఎప్సెట్-2025 మొదటి విడత సీట్ల కేటాయింపు