బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ (KTR) మరోసారి కాంగ్రెస్ నేతల విమర్శలకు తలపడ్డారు. ఈసారి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) సూటిగా ఆయనను insult చేశారు. కేటీఆర్ మా అనుభవం ముందు శూన్యం, ఇంకా పిల్లాడిలా మాట్లాడతాడు అంటూ విమర్శల వర్షం కురిపించారు.మంగళవారం గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చర్చకు పిలవడం అనర్హం. అతనికి ఆ స్థాయి లేదు. మేమంతా క్షేత్రస్థాయిలో పనిచేసి ఎదిగాం. ఆయన మాత్రం నేరుగా ఎమ్మెల్యే అయ్యాడు. ఎప్పుడైనా సర్పంచ్‌గానో, జడ్పీటీసీగానో గెలిచాడా? అంటూ ఆయన ప్రశ్నించారు.

తండ్రి ద్వారా వచ్చిన పదవులు మాకు పనికివిచ్చవు
కేటీఆర్ రాజకీయాల్లో కష్టాలు తెలియవు. ఆయనకి అన్ని తండ్రి బలం వల్లే వచ్చాయి. మేము నానా తిప్పలు పడినవాళ్లం. మాకు ప్రజల మద్దతు ఉంది. ఆయన అడుగుపెట్టిన మార్గం సులువైనది కానీ మాకు వచ్చిన మార్గం కష్టాలదే’’ అని జగ్గారెడ్డి వివరించారు.కేటీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే. కాంగ్రెస్ నేతలను ‘గాడిదలు’ అంటున్నారు. దీన్ని మేము ఏ మాత్రం సహించం. ఒక మాట అంటే మేము పది మాటలు అంటాం. ముఖ్యమంత్రిపై దూషణలు ఆపితే, మేము కూడా విమర్శలు ఆపేస్తాం అని హెచ్చరించారు.
ఆధికారం కోల్పోయిన తడవే కేటీఆర్‌లో ఆందోళన
18 నెలలుగా అధికారంలో లేరు కాబట్టి ఆయన గట్టున పడ్డ చేపలా తిష్టుకుంటున్నారు. సోదరి కవిత అరెస్టు బాధతో ఒత్తిడిలో ఉన్నారు. అందుకే విదేశీ పర్యటనలకు ఎక్కువగా వెళ్తున్నారు అని జగ్గారెడ్డి ఆరోపించారు.కేటీఆర్ ముందు కాంగ్రెస్‌ను విమర్శించాలంటే ముందుగా అధ్యయనం చేయాలి. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. కాకపోతే ప్రజలునే తిరస్కరిస్తారు అంటూ జగ్గారెడ్డి తేల్చిచెప్పారు.
Read Also : Nara Lokesh : ప్రెస్టీజ్ గ్రూప్‌కు మంత్రి నారా లోకేశ్ ఆహ్వానం