హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల(Jubilee Hills by-election) ఫలితాల అనంతరం తన పదవికి గండం పొంచి ఉందనే భయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో(Revanth Reddy) మొదలైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి మానసిక స్థితి దెబ్బతిన్నట్లు ఉందని, అందుకే సందర్భం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిని చూసి సిగ్గు కూడా సిగ్గుపడేలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: Ambati Rambabu: బాబుని ,లోకేష్ ని బుజం మీద ఎత్తుకోండి.. మాకేం అభ్యంతరం లేదు: అంబటి

కమాండ్ కంట్రోల్, ప్రగతి భవన్ అంశాలపై విమర్శలు
కమాండ్ కంట్రోల్ కేంద్రం, ప్రగతి భవన్ వ్యవహారాలపై జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) ముఖ్యమంత్రిని నిలదీశారు. నగరంలో నిఘా పెట్టేందుకు కేసీఆర్ కమాండ్ కంట్రోల్ నిర్మిస్తే, రేవంత్ రెడ్డి అదే కమాండ్ కంట్రోల్‌లో కూర్చొని తమపై నిఘా పెడుతున్నారని మండిపడ్డారు. ప్రగతి భవన్‌లో బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు, కమాండ్ కంట్రోల్, సచివాలయం వంటి అంశాలపై కమిషన్ వేయాలని ఆయన ప్రశ్నించారు. ప్రగతి భవన్‌లో ఎన్ని గదులు ఉన్నాయో చూడటానికి రావాలని సూచించారు.
జూబ్లీహిల్స్ ఎన్నికలు, నోటి దురుసుతనం
హైదరాబాద్ అభివృద్ధి అజెండాపైనే జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేయబోతున్నారని జగదీశ్ రెడ్డి అన్నారు. దేశంలో ఎవరూ తిట్టని విధంగా వైఎస్‌ను, సోనియా గాంధీని రేవంత్ రెడ్డే తిట్టారని ఆరోపించారు. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలను ఎన్ని రోజులు భయపెడతారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదని జోస్యం చెప్పిన ఆయన, రేవంత్ రెడ్డి చేసే తప్పులను చరిత్ర క్షమించదని అన్నారు. రేవంత్ రెడ్డి తన నోటి దురుసుతనం కారణంగా బీహార్ నుంచి వెళ్లగొట్టే పరిస్థితి తెచ్చుకున్నారని, అందుకే ఆయనను కాదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ప్రచారానికి పిలిపించుకున్నారని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరూ మోదీ శిష్యులేనని, అందుకే వారిని కేటీఆర్ ‘బ్యాడ్ బ్రదర్స్’ అన్నారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి డ్రగ్స్ మత్తులో మాట్లాడుతున్నారని విమర్శించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: