హైదరాబాద్ : నీటిపారుదల శాఖా సెంట్రల్ డిజైన్ (Irrigation Department Central Design) విభాగం పటిష్ఠతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ ఉదంతంలో జాతీయ భద్రత సంస్థతో పాటు జస్టిస్ ఘోష్ కమిషన్ చేసిన వ్యాఖ్యలతో సి.డి.ఓ ప్రతిష్ట దెబ్బతిన్నదని ఆయన వ్యాఖ్యానించారు. అటువంటి వ్యాఖ్యాలపై సి.డి.ఓ పునఃసమీక్షించుకుని సంస్కరణలు చేపట్టడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్ సచివాలయంలో నీటిపారుదల శాఖాధికారులతో ఆయన విసృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా సి.డి.ఓను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ముక్యంగా ప్రాజెక్టుల డిజైన్ల రూపకల్పనలో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకరావాలన్నారు.

అందుకు అవసరమైన లేటెస్ట్ సాఫ్ట్వేరను ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇతర మోలిక సదుపాయాలకల్పనలో ముందుండాలన్నారు. సమయంలో సి.డి.ఓ లో ఖాళీగా ఉన్న ఉద్యగాల భర్తీకి తక్షణం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు అన్నీ స్థాయిలలో ఉద్యగాల భర్తీ చేపట్టడం సంస్థను బలోపేతం చేయడంలో బాగామేనన్నారు. ఐ.ఐ.టిలు, ఎన్.ఐటిలవంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల నుండి నీటిపారుదల శాఖలో నియమితులైన ఇంజినీర్లను సి.డి.ఓ లో పోస్టింగ్ ఇవ్వబోతున్నట్లు ఆయన వెల్లడించారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు (Project structures) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నవి కావడంతో ప్రతిభావంతులైన ఇంజినీర్ల సేవలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంజినీరింగ్, సృజనాత్మక అవసరమని అది అత్యుత్తమ శిక్షణ పొందిన నిపుణుల ద్వారానే సాధ్యపడుతుందన్నారు. అటువంటి నిష్ణాతులైన ఇంజినీర్లను వినియోగిస్తూ అత్యాధునిక పరిజ్ఞానం వినియోగించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోవాలన్నారు. పదవీ విరమణ పొందిన అనుభవం కలిగిన అనుభవజ్ఞులైన వారి సేవలు కుడా వినియోగించుకుని అద్భుతమైన ఫలితాలు రాబట్టలని అన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :