Indiramma Sarees : తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వంతో మరోసారి నిరాశే ఎదురైంది. రెండేళ్లుగా భారీ ఆశలతో ఎదురుచూస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీకి అడ్డంకి ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో చీరల పంపిణీని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో బతుకమ్మ సందర్భంగా మహిళలకు రంగురంగుల చీరలు ఇచ్చే ఆనవాయితీ మొదలైంది. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి కాదు రెండు చీరలు ఇస్తామని ప్రకటించినా ఆ హామీ పూర్తిగా అమలుకాలేదు.
రెండేళ్ల తర్వాత ఇటీవల బతుకమ్మ చీరలకు ‘ఇందిరమ్మ’ అనే పేరు పెట్టి నవంబర్‌లో పంపిణీ మొదలు పెట్టింది ప్రభుత్వం. కానీ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో హడావుడిగా (Indiramma Sarees) ప్రారంభించిన ఈ పంపిణీ క్రమంగా గందరగోళంగా మారింది. చివరకు ఎన్నికల కోడ్ కారణంగా పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది.
Read also: Maoist Bandh: ఎన్‌కౌంటర్ తరువాత మావోయిస్టుల హెచ్చరిక
ప్రభుత్వం మొత్తం కోటి చీరలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు కేవలం 44 లక్షల చీరలే పంపిణీ అయ్యాయి. మిగిలిన చీరల పంపిణీపై ఇప్పుడు అనిశ్చితి నెలకొంది.
ఇందిరమ్మ చీరలపై మహిళల నుంచి పెద్దగా స్పందన కనిపించడంలేదు. అందరికీ ఒకే రంగు చీరలు ఇవ్వడం, స్కూల్ యూనిఫామ్ మాదిరి ఉండడం వల్ల చాలామంది తీసుకోవడానికి మొహమాటం పడుతున్నారు. అంతేకాదు, చీరల రంగుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా వర్ణాలు కనిపించడంతో రాజకీయ కనుకలుగా భావిస్తూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పండుగ సమయంలో కాకుండా, ఎన్నికల సమీపంలో మాత్రమే చీరలు పంపిణీ చేయడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేవలం ఓట్ల కోసమే ఈ పథకాన్ని అమలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల అనంతరం ఇందిరమ్మ చీరల పంపిణీ తిరిగి కొనసాగుతుందో లేదో అన్నదానిపై స్పష్టత లేకపోవడం మరో చర్చకు దారితీస్తోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: