हिन्दी | Epaper
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

Indiramma-illu : ఇందిరమ్మ ఇండ్ల పథకం నత్తనడకలో ప్రజల ఆశలు వృథా

Sai Kiran
Indiramma-illu : ఇందిరమ్మ ఇండ్ల పథకం నత్తనడకలో ప్రజల ఆశలు వృథా

ఇందిరమ్మ ఇండ్ల పథకం నత్తనడకలో – వికారాబాద్ జిల్లాలో లబ్ధిదారుల నిరాశ

వికారాబాద్‌, అక్టోబర్‌ 13 :

Indiramma-illu : ఇందిరమ్మ ఇండ్ల పథకం పై కాంగ్రెస్‌ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం ప్రజల్లో తీవ్ర ఆవేదనకు కారణమవుతోంది. పైలెట్ ప్రాజెక్టు పేరిట ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామని (Indiramma-illu) ప్రభుత్వం పెద్ద పెద్ద హామీలు ఇచ్చినా, ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా పూర్తవకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.

రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా, నిజానికి కేవలం పత్రాలపైనే పథకం ముందుకెళ్తోంది. లబ్ధిదారుల ఎంపిక పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నా, నిర్మాణం మాత్రం ఇంకా ప్రారంభ దశలోనే నిలిచిపోయింది.

ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సాయం కూడా ఇప్పటివరకు చాలామందికి అందలేదు. బేస్‌మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేసినప్పుడే సాయం అందిస్తామన్న నిబంధన వల్ల లబ్ధిదారులు పెద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు తమ పాత ఇళ్లు కూల్చి కొత్త ఇళ్ల కోసం వేచి ఉన్నా, సాయం అందక అవస్థలు పడుతున్నారు.

Read also : డోన్-గుంటూరు రైలును గుంతకల్లు -విజయవాడ మధ్య నడపాలి

జిల్లాలో పరిస్థితి ఇలా ఉంది:

  • వికారాబాద్ జిల్లాకు మంజూరైన ఇళ్లు – 11,785
  • మార్కింగ్ పూర్తి అయినవి – 5,708
  • పునాది వరకు పూర్తయినవి – 628
  • ఆర్థిక సాయం పొందిన వారు – 573 మంది మాత్రమే
  • గోడల వరకు పూర్తయినవి – 69 ఇళ్లు
  • స్లాబ్ వరకు పూర్తయినవి – 25 ఇళ్లు
  • 53 మందికి రూ.2 లక్షలు, 20 మందికి రూ.4 లక్షల వరకు సాయం అందజేశారు.

ప్రజల అసంతృప్తి పెరుగుతోంది:

ప్రభుత్వం అరకొర సాయం, ఆలస్యం, కాగితపనుల్లో ఇరుక్కుపోయిన పథకం వల్ల లబ్ధిదారులు నిరాశలో ఉన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, రేషన్ కార్డుల విషయంలోనూ విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ఇండ్ల పథకంలోనూ పేదల కలలపై నీళ్లు పోసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు “అర్హులందరికీ సాయం అందుతుంది” అంటూ ప్రచారం చేస్తున్నా, వాస్తవానికి కొద్దిమందికే సహాయం అందింది. మిగతావారు మాత్రం ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తూ కష్టాల్లో ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

https://vaartha.com/today-gold-rate/gold-silver-prices-oct-13-2025/563574/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

ఈ కార్డు ఉంటేనే ఇందిరమ్మ బిల్లులు..

ఈ కార్డు ఉంటేనే ఇందిరమ్మ బిల్లులు..

రాత్రి మెట్రో సేవలు పొడిగించాల్సిందని నగరవాసుల డిమాండ్

రాత్రి మెట్రో సేవలు పొడిగించాల్సిందని నగరవాసుల డిమాండ్

అమెరికా నుంచి వచ్చి, కోడల్ని గెలిపించుకున్న మామ

అమెరికా నుంచి వచ్చి, కోడల్ని గెలిపించుకున్న మామ

ఫోన్ ట్యాపింగ్ పై కొనసాగుతున్న ప్రభాకర్ రావు విచారణ

ఫోన్ ట్యాపింగ్ పై కొనసాగుతున్న ప్రభాకర్ రావు విచారణ

రేపు మూడో విడత పంచాయతీ పోలింగ్ ..2 రోజులు స్కూళ్లకు సెలవు

రేపు మూడో విడత పంచాయతీ పోలింగ్ ..2 రోజులు స్కూళ్లకు సెలవు

అదనపు కట్నం వేధింపుల పరాకాష్ట.. మహబూబాబాద్‌లో కోడలి హత్య

అదనపు కట్నం వేధింపుల పరాకాష్ట.. మహబూబాబాద్‌లో కోడలి హత్య

ఫలితాల తారుమారుతో పరేషాన్

ఫలితాల తారుమారుతో పరేషాన్

విద్యార్థుల సంఖ్య ఆధారంగా కుక్ కమ్ హెల్పర్ల నియామకం

విద్యార్థుల సంఖ్య ఆధారంగా కుక్ కమ్ హెల్పర్ల నియామకం

ధర్మసాగర్ మండలంలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థుల జాబితా

ధర్మసాగర్ మండలంలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థుల జాబితా

తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం

తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం

ఫుడ్ పాయిజన్ పై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలి

ఫుడ్ పాయిజన్ పై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలి

📢 For Advertisement Booking: 98481 12870