Indiramma illu : తెలంగాణ(Telangana) ప్రభుత్వం కొత్త పద్ధతిలో ఇందిరమ్మ(Indiramma illu) ఇల్లు నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. 60 చదరపు గజాల కంటే తక్కువ స్థలంలో కూడా ఇప్పుడు జీ+1 స్థాయి ఇల్లు నిర్మించుకోవచ్చు.ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, ఇల్లు కనీసంగా రెండు గదులు, ఒక కిచెన్, మరియు బాత్రూమ్ కలిగి ఉండాలి.
Read also: Jagan: జగన్ లండన్ పర్యటనపై CBI విచారణ

చెల్లింపుల విధానం మరియు విడతలు
ఇప్పటి విధానంలో భవనం నిర్మాణానికి మూడు విడతల్లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణానికి రెండు విడతల్లో రూ.1 లక్ష చెల్లించాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం కోసం ఒకసారి రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. చివరి విడతగా మరో రూ.1 లక్ష చెల్లించి నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చు. ఈ విధానం ద్వారా ప్రభుత్వ ఆర్ధిక భారం తగ్గుతుంది. ఈ నిబంధనతో పట్టణ ప్రాంతాలలో ఇందిరమ్మ(Indiramma) ఇళ్ళు నిర్మించుకోవడం మరింత వెసులుబాటు అవుతుంది. చిన్న స్థలంలో ఉన్నవారు కూడా రెండు అంతస్థుల ఇల్లు కుదిర్చుకోవడానికి అవకాశం పొందుతారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/