Indiramma illu : పేదలకు స్వంత ఇంటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ములుగు జిల్లాలో వేగంగా ముందుకు సాగుతోంది. ప్రతి వారం ఒక రోజు లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించి, పనులు ఎంతవరకు పూర్తయ్యాయో ఆధారంగా బిల్లులు విడుదల చేస్తుండటంతో, లబ్ధిదారులు నిర్మాణాలను త్వరితగతిన తీసుకొస్తున్నారు.
ఈ క్రమంలో ములుగు జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలవడం విశేషం. జిల్లా పనితీరును అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ మరియు గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌కు ప్రశంసపత్రాలను పంపింది.
Read also: Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ పోలింగ్.. ప్రముఖులు ఓట్లు వేసేది ఎక్కడంటే?
జిల్లాలో ఇప్పటివరకు కేటాయించిన ఇళ్ల సంఖ్య (Indiramma illu) :
మొత్తం 4,578 ఇళ్లు ములుగు జిల్లాకు రెండు దఫాలలో ప్రభుత్వం మంజూరు చేసింది.
- మొదటి విడత: 754 ఇళ్లు
- రెండో విడత: 3,824 ఇళ్లు
ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని మోడల్ విలేజ్ గా ఎంపిక చేసి అక్కడ నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం 4,503 ఇళ్ల పనులు విస్తృతంగా జరుగుతున్నాయి.

మరిన్ని వెయ్యి ఇళ్లకు అవకాశం
ఇటీవలి దరఖాస్తుల పరిశీలన అనంతరం, జిల్లాకు మూడో విడతలో మరో 1,000 ఇళ్లు (Indiramma illu) మంజూరయ్యే అవకాశం ఉంది. అధికారులు గ్రామాలకు వెళ్లి లబ్ధిదారుల అర్హతలను ధృవీకరించి జాబితాను సిద్ధం చేశారు. ఆమోదం త్వరలో వచ్చే అవకాశం అధికారులు తెలిపారు.
నిర్మాణాల పురోగతి (జిల్లా స్థాయి వివరాలు)
| నిర్మాణ దశ | పూర్తి అయిన ఇళ్ల సంఖ్య |
|---|---|
| బేస్మెంట్ పూర్తయినవి | 3388 |
| గోడల నిర్మాణం పూర్తైనవి | 1105 |
| స్లాబ్ వరకు వచ్చినవి | 383 |
అధికారుల వ్యాఖ్య (Indiramma illu) :
“లబ్ధిదారులు ఇళ్ల పనులను వేగంగా చేపడుతున్నారు. బిల్లుల చెల్లింపులో ఆలస్యం లేకుండా, ప్రతి వారం ఒక రోజు చెల్లింపు నిర్వహిస్తున్నాం. అన్ని ఇళ్లు సమయానికి పూర్తయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం” అని జిల్లా అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also :