Indiramma illu Scheme : తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేయడానికి ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద మరో శుభవార్తను ప్రకటించింది. ఇప్పటికే రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్న ప్రభుత్వం, (Indiramma illu Scheme) ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ కింద అదనంగా రూ.12 వేల ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించింది.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుంటున్న లబ్ధిదారులకు ఈ అదనపు సాయం వర్తిస్తుంది. గోడలు, స్లాబ్ వరకు నిర్మాణం పూర్తైన ఇళ్లకు మాత్రమే ఈ ప్రోత్సాహకం అందుతుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఇటీవల ప్రభుత్వం జారీ చేసింది.
Read also : Crime: మటన్లో కారం తెచ్చిన తంటా.. భార్య భర్తలు ఇద్దరు బలి
ప్రస్తుతం అధికారులు మండలాల వారీగా అర్హుల జాబితా సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ జాబితాను పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ ఉద్యోగులు, ఎంపీడీవోలు కలిసి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే మరుగుదొడ్లు నిర్మించి ఈ సాయం పొందినవారికి ఈసారి ప్రోత్సాహకం లభించకపోవచ్చని సమాచారం.

ఈ నిర్ణయంతో పేదల ఇళ్ల నిర్మాణం మరింత వేగవంతం కావడం ఖాయం. ఉపాధి హామీ పథకాన్ని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో అనుసంధానం చేస్తూ ప్రభుత్వం ముందే కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇచ్చే అదనపు ప్రోత్సాహకంతో లబ్ధిదారులు మరింత లాభపడనున్నారు.
ఇందిరమ్మ ఇళ్లు పథకం ముఖ్య లక్ష్యం పేదలకు సొంతిల్లు కల్పించడం మాత్రమే కాదు, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, పేద కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. ప్రతి నియోజకవర్గం నుంచి 3,500 మందికి ఇళ్లు మంజూరు చేయడం ద్వారా ప్రభుత్వం దాదాపు 4 లక్షలకు పైగా ఇళ్లను తొలి దశలో కేటాయించింది.
ఈ పథకం ద్వారా పేదల జీవన విధానం మెరుగుపడటమే కాకుండా గ్రామీణాభివృద్ధికి కూడా తోడ్పడనుంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :