ఇందిరమ్మ ఇళ్ల పథకం : 44.4 చదరపు గజాల లోపు ఉన్నవారికీ అర్హత
Indiramma illu updates : హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక నిర్ణయం తీసుకుంది. 400 చదరపు అడుగుల (అంటే 44.4 చదరపు గజాలు) లోపు స్థలం ఉన్న లబ్ధిదారులు ఇప్పుడు జీ+1 (G+1) విధానంలో ఇళ్లు నిర్మించుకునే అవకాశం పొందారు. (Indiramma illu updates) ఈ నిర్ణయంతో ప్రధానంగా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పెద్ద పట్టణాల్లో నివసించే ఇరుకైన స్థలాల లబ్ధిదారులకు ఊరట లభించింది.
హౌసింగ్ శాఖ కార్యదర్శి గౌతమ్ బుధవారం దీనిపై అధికారిక ఉత్తర్వులు (జీవో) విడుదల చేశారు. ఇప్పటివరకు ఈ పథకంలో 400 నుంచి 600 చ.అ. మధ్య ఉన్న స్థలాలకే అనుమతులు ఉండేవి. ఇప్పుడు 400 చ.అ. లోపు స్థలాలకూ ఈ సౌకర్యం వర్తిస్తుంది.
ప్రభుత్వం మొదటి విడతలో మొత్తం 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, వీటిలో 3.31 లక్షల ఇళ్లకు అనుమతులు ఇప్పటికే జారీ అయ్యాయి. ప్రస్తుతం 96 వేల ఇళ్లు పునాది దశలో, 36 వేల ఇళ్లు గోడల దశలో, 26 వేల ఇళ్లు శ్లాబ్ దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు.
Latest News: IND vs AUS: అడిలైడ్‌లో వర్షం మరియు మ్యాచ్ పరిస్థితులు

Indiramma illu updates జీ+1 ఇళ్ల నిర్మాణానికి కొత్త మార్గదర్శకాలు
- 400 చ.అ.లోపు స్థలంలో కార్పెట్ ఏరియా కనీసం 323 చ.అ. ఉండాలి
- పెద్ద గది 96 చ.అ.కు మించరాదు, రెండో గది 70 చ.అ.లోపు ఉండాలి
- వంటగది కనీసం 35.5 చ.అ. ఉండాలి
- ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి, బాత్రూమ్ తప్పనిసరిగా ఉండాలి
- ఇల్లు ఆర్‌సీసీ ఫ్రేమ్ (RCC Frame) పద్ధతిలో నిర్మించాలి
- డిజైన్‌కు హౌసింగ్ శాఖ డిప్యూటీ ఈఈ నుంచి అనుమతి అవసరం
ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం Indiramma illu updates
- గ్రౌండ్ ఫ్లోర్‌కు ₹1,00,000
- రూఫ్ లెవల్‌కు ₹1,00,000
- ఫస్ట్ ఫ్లోర్‌కు ₹2,00,000
- నిర్మాణం పూర్తయ్యిన తర్వాత ₹1,00,000
మొత్తం రూ.5 లక్షలు ప్రభుత్వం అందించనుంది.
పట్టణాల్లో ఇరుకైన స్థలాల వారికి సడలింపు: మంత్రి పొంగులేటి
రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, “పట్టణాల్లో చాలా మందికి పెద్ద స్థలం దొరకడం కష్టం. అందుకే తక్కువ స్థలాల్లో జీ+1 విధానంలో ఇళ్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం” అని తెలిపారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :