తగ్గనున్న ఇంటి నిర్మాణ ఖర్చులు
Hyderabad: ఇందిరమ్మ ఇళ్ల (Indiramma house) పథకం పనులను వేగవంతం చేసేందుకు, లబ్దిదారులకు ఖర్చులను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా నిర్మాణ సామాగ్రి అయిన సిమెంటు, స్టీల్, ఇటుక వంటి వాటి ధరలను మండల స్థాయిలో నిర్ణయించాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి ఆదేశించారు. దీనివల్ల నిర్మాణ వ్యయం తగ్గి, సామాన్యులకు అదనపు భారం తగ్గుందని అన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రేవంత్ సర్కార్ (Revanth Sarkar) ఇందిరమ్మ ఇండ్ల (Indiramma house) పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాగా.. ప్రస్తుతం ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. కాగా, ఈ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి, సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలకు నిర్మాణ సామగ్రిని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. సిమెంటు, స్టీల్, ఇటుక వంటి నిర్మాణ సామగ్రి ధరలను మండల స్థాయిలో నిర్ణయించడానికి ధరల నిర్ణయ కమిటీలు సమావేశం కావాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటికే 20 ప్రాంతాల్లో ఇసుక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు భట్టి వెల్లడించారు. ఇసుక సామాన్యులకు మరింత అందుబాటులో ఉండేలా మార్కెట్ యార్డులు, ప్రభుత్వ స్థలాల్లో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దీని వల్ల ఇసుక కొరతను నివారించడమే కాకుండా.. అక్రమ ఇసుక రవాణాను కూడా నియంత్రిస్తుందని తెలిపారు. సర్కార్ నిర్ణయం వల్ల నిర్మాణ వ్యయం తగ్గి, అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణం మరింత సులభతరం అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Read also: Mahila Shakthi: మహిళా శక్తి చీరెల కుట్టుకూలీ నిర్ణయంలో జాప్యం