డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహిళల ఆర్థికాభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి (Indira Mahila Shakti) పథకం ఎంతో కీలకమని పేర్కొన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా చింతకానిలో మధిర నియోజకవర్గ స్థాయి కార్యక్రమంలో ఆయన పాల్గొని వడ్డీలేని రుణాల చెక్కులు, లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులు పంపిణీ చేశారు. మహిళలు ఆత్మగౌరవంతో, ఆర్థిక స్వావలంబనతో జీవించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని తెలిపారు.
కోటికి కోటీశ్వరుల లక్ష్యం
భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తయారు చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఇందుకోసం సంవత్సరానికి రూ.20 వేల కోట్ల మేర వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అందజేస్తున్నామని వివరించారు. మహిళలు తమ స్వంత బిజినెస్‌లు ప్రారంభించి, కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టేందుకు ఇది గొప్ప అవకాశం అని అన్నారు.
బీమా రక్షణతో భద్రతా కల్పన
పథకంలో భాగంగా మహిళలకు వడ్డీ లేని రుణాలతో పాటు లోన్ బీమా, ప్రమాద బీమా వంటి భద్రతా చర్యలు కూడా తీసుకుంటున్నట్టు భట్టి వెల్లడించారు. రుణం తీసుకున్న మహిళ గనక ఏదైనా అప్రమత్త పరిస్థితి ఎదురైతే కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలకు కొత్త జీవన దారులు తెరచుకుంటాయని అన్నారు.
Read Also : Ration Card Distribution : రూ.లక్ష కోట్లు వాళ్ల జేబులోకి వెళ్లాయి – రేవంత్