తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు (Harishrao) భూవివాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఒకప్పుడు తెలంగాణలో ఒక ఎకరం భూమి అమ్మితే, ఆంధ్రప్రదేశ్‌లో పదిహేను ఎకరాలు కొనుగోలు చేయొచ్చని అభిప్రాయపడ్డ హరీష్, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలిపారు. “ఇప్పుడు ఏపీలో ఒక ఎకరం అమ్మితే, తెలంగాణలో రెండు ఎకరాలు వస్తున్నాయి. అంటే భూముల విలువ నామమాత్రంగా తగ్గిపోయింది” అని అన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నేరుగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
భూముల ధరలు పడిపోతున్నాయని ఆందోళన
సిద్దిపేట జిల్లా గంగాపూర్ ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంలో హరీశ్ రావు అక్కడి రైతులతో మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. భూములు అమ్మడానికి ప్రయత్నించినప్పటికీ, కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని రైతులు చెప్పినట్టు తెలిపారు. ఒకప్పుడు రూ.40 లక్షలుగా ఉన్న ఎకరం భూమి, ఇప్పుడు రూ.20 లక్షలకు పడిపోయిందని వెల్లడించారు. ఈ మార్పు రైతులకు ఆర్థికంగా భారంగా మారిందని ఆయన అన్నారు.
రేవంత్ పాలన వల్లే భూముల విలువ పతనమన్న ఆరోపణ
హరీశ్ రావు పేర్కొన్న విధంగా, రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలోనే భూముల ధరలు సగం అయ్యాయని విమర్శించారు. సాగు నీటి సమస్యలు, అభివృద్ధి పనుల నిష్క్రియత, పెట్టుబడిదారుల నిరుత్సాహం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని హరీశ్ అభిప్రాయపడ్డారు. రైతులను దెబ్బతీసే విధంగా జరుగుతున్న పాలనను తప్పుబడుతూ, ప్రభుత్వ చర్యలు భూ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయని అన్నారు.
Read Also : Tamil Nadu: భర్తను చంపేందుకు సాంబారులో విషం కలిపిన భార్య