తెలంగాణలో ఇటీవల రాజకీయ, ప్రాజెక్టుల క్రమంలో కొత్త ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ (Smita Sabharwal), కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) కు సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టుకు ఆశ్రయం పొందిన విషయం అత్యంత ఆసక్తికరంగా ఉంది. నోటీసులు జారీ చేసిన విధానం, వాంగ్మూలం నమోదును ప్రశ్నిస్తూ, నివేదికను కొట్టివేయాలని కోరారు. మధ్యంతర ఉత్తర్వులు (Interim orders) జారీ చేసి, తనపై చర్యలు తీసుకోకుండా నిరోధించాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది.

ఆమె పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉండగా
కాగా ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషీ (SK Joshi) హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు ఇటీవల ఊరట లభించిన విషయం తెలిసిందే.
కమిషన్ నివేదిక సిఫారసుల ఆధారంగా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ హైకోర్టు (TG High Court)మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా స్మితా సభర్వాల్ సైతం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ప్రస్తుతం ఆమె పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉండగా.. పరిశీలన పూర్తయి లిస్ట్ అయిన తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: