हिन्दी | Epaper
తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

Telugu News: Telangana Jagruthi: కృష్ణారావుపై ఆరోపణలను నిరూపిస్తా: కవిత సంచలన వ్యాఖ్యలు 

Sushmitha
Telugu News: Telangana Jagruthi: కృష్ణారావుపై ఆరోపణలను నిరూపిస్తా: కవిత సంచలన వ్యాఖ్యలు 

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆయనలోని అసహనాన్ని, ఫ్రస్ట్రేషన్‌ను బయటపెడుతోందని తెలంగాణ జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత (Kavitha) ఘాటుగా స్పందించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో గత 15 ఏళ్లుగా నెలకొన్న సమస్యలను మాత్రమే తాను ప్రస్తావించానని, దానికి ఎమ్మెల్యే వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని ఆమె హితవు పలికారు.

Read Also: Revanth Reddy : చెన్నా రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి వరకూ సినీ పరిశ్రమకు మద్దతు అల్లు అరవింద్

ఆయన చేసిన ప్రతి ఆరోపణకు త్వరలోనే డాక్యుమెంట్లతో సహా ప్రెస్ మీట్ పెట్టి మరీ సమాధానం చెబుతానని ఆమె సవాల్ విసిరారు. ఎమ్మెల్యే మాటలకు తాను బాధపడటం లేదని, ప్రజలంతా అన్నీ గమనిస్తున్నారని కవిత స్పష్టం చేశారు.

బోయినపల్లి పాఠశాల సందర్శన – మౌలిక వసతులపై హామీ

జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఐదు రోజుల పాటు హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న కవిత, కంటోన్మెంట్‌లోని బోయినపల్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలను బాగు చేసినప్పటికీ, కాంపౌండ్ వాల్ మరియు సీసీ కెమెరాలు లేకపోవడాన్ని ఆమె గమనించారు.

ఆ సౌకర్యాలను జాగృతి సంస్థ తరఫున తామే ఏర్పాటు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. అలాగే అదే పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో హెల్పర్లు లేకపోవడం వంటి సమస్యలను గుర్తించారు. జనం బాటలో భాగంగా విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించామని, పాఠశాలలు, ఆసుపత్రుల్లో మౌలిక వసతుల లేమిని, ఇళ్లు, ఇళ్ల పట్టాల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని వివరించారు.

I will prove the allegations against TG Krishna Rao: Kavitha’s sensational comments

విద్యార్థులకు భరోసా మరియు స్కాలర్‌షిప్‌ల ప్రకటన

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న టాప్ టెన్ విద్యార్థులకు తమ సంస్థ తరఫున స్కాలర్‌షిప్‌లు అందిస్తామని కవిత ప్రకటించారు. అదేవిధంగా ప్రభుత్వ పరంగా విద్యార్థులకు రావాల్సిన ప్రయోజనాలను కూడా దగ్గరుండి సాధించి పెడతామని హామీ ఇచ్చారు.

తాము ఏ జిల్లాకు వెళ్లినా ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, సమస్యలను పరిష్కరించే అవకాశం తమకు దక్కుతోందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తమ పరిధిలో పరిష్కరించగలిగే సమస్యలను సంస్థ ద్వారా చేస్తామని, మిగిలిన వాటిపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు.

జనం గళంగా తెలంగాణ జాగృతి

గత ప్రభుత్వ హయాంలో తనను కేవలం నిజామాబాద్‌కే పరిమితం చేశారని, దానివల్ల రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులను గమనించలేకపోయానని కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మార్పులను, జరగని పనులను జనం బాట ద్వారా తెలుసుకుంటున్నానని చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పాలకపక్షం, ప్రతిపక్షం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని, అందుకే జాగృతి జనం గళమై పనిచేస్తోందని ఆమె తెలిపారు. మంచిని మంచి అని, చెడును చెడు అని నిర్భయంగా చెబుతామని, బోయినపల్లి పాఠశాల బాగుందనే విషయాన్ని కూడా అదే స్ఫూర్తితో అంగీకరిస్తున్నామని కవిత పేర్కొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870