హైదరాబాద్ నగరాన్ని వరదల ముప్పు నుంచి రక్షించేందుకు హైడ్రా (HYDRA) కీలక నిర్ణయాలు తీసుకుంది. చారిత్రక గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించడం ద్వారా వర్షాకాలంలో నీటి ప్రవాహాన్ని సమర్థవంతంగా నియంత్రించాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. తొలిదశలో ఆరు చెరువులను అభివృద్ధి చేసే పనులు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. చెరువులు, నాలాల పునరుద్ధరణతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటుగా వరద ముప్పు తగ్గుతుందని హైడ్రా ఆశాభావం వ్యక్తం చేసింది.
ఆక్రమణలపై ప్రజల సహకారం కీలకం
చెరువులు, నాలాలు అనేక కారణాల వల్ల ఆక్రమించబడుతున్నాయని, దీనివల్ల నగరంలో నీటి నిలిచిపోయే సమస్యలు, వరదలు అధికమవుతున్నాయని హైడ్రా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆక్రమణలను అరికట్టాలంటే ప్రభుత్వంతోపాటు ప్రజల భాగస్వామ్యం అవసరమని హైడ్రా స్పష్టం చేసింది. చెరువులు, కుంటలు, వాగులు ఆక్రమించబడుతున్నట్లు గమనించిన వారు వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేసింది.
ఫిర్యాదుల కోసం ప్రత్యేక కమ్యూనికేషన్ చానెల్స్
ఆక్రమణలపై ఫిర్యాదు చేయాలనుకునే వారు 8712406899 అనే వాట్సాప్ నంబర్‌కు ఫొటోలు, వీడియోలు, లొకేషన్ వివరాలతో సమాచారం పంపవచ్చని హైడ్రా తెలిపింది. అదనంగా, కమిషనర్ హైడ్రా అనే పేరుతో ఉన్న ఎక్స్ (Twitter), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాల ద్వారా కూడా సమాచారం పంపించవచ్చని తెలిపింది. అత్యవసర స్థితుల్లో హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌కు నేరుగా 7207923085 నంబర్‌కు కాల్ చేయవచ్చని హైడ్రా సూచించింది. చెరువుల పరిరక్షణకు ప్రజల సహకారమే ప్రధాన ఆయుధమని పేర్కొంటూ, ఈ ప్రయత్నం విజయవంతం కావాలని హైడ్రా ఆకాంక్ష వ్యక్తం చేసింది.
Read Also ; Watermelon: పుచ్చకాయ గింజల్లో ఆరోగ్య లాభాలెన్నో