Hydra Ranganath : హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పరిరక్షణ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఎ.వి. రంగనాథ్ అధికారిక సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఉదంతం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. నగరంలోని కొన్ని ప్రముఖ ఇంటర్మీడియట్ కళాశాలలు ఇంటర్ బోర్డు నుంచి గుర్తింపు (అఫిలియేషన్) పొందడం కోసం నకిలీ అగ్నిమాపక నివారణ ధృవీకరణ పత్రాలను (Fire NOC) సమర్పించినట్లు ఆధారాలతో సహా వెల్లడైంది. రంగనాథ్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన కాలానికి సంబంధించి ఈ ఫోర్జరీ సంతకాలను సృష్టించి బోర్డును, ప్రభుత్వాన్ని తీవ్రంగా పక్కదారి పట్టించేందుకు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు యత్నించడం గమనార్హం.
Read Also : హైదరాబాదీలకు గుడ్ న్యూస్: రోడ్డుపైకి 100 కొత్త ఆర్టీసీ మినీ బస్సులు!

బాధ్యులైన కళాశాలలు మరియు చట్టపరమైన చర్యలు
ఈ నకిలీ ఎన్ఓసీల వ్యవహారంపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, సదరు అక్రమాలకు పాల్పడిన కళాశాలల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డుకు ఫిర్యాదు చేయడంతో పాటు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. రంగనాథ్ ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఫోర్జరీ వ్యవహారంలో చిక్కుకున్న విద్యా సంస్థల జాబితాలో హైందవీ కాలేజ్ (బర్కత్‌పుర), రెసోనెన్స్ (ఎస్ఆర్ నగర్), ప్రియాంక (మెహిదీపట్నం), మదర్ గర్ల్స్ (విద్యానగర్), శ్రీచైతన్య (చాంద్రాయణగుట్ట), న్యూఎరా (చిక్కడపల్లి), షాహీన్ (శివరాంపల్లి), మరియు వశిష్ఠ (తెల్లాపూర్) ఉన్నాయి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ నకిలీ పత్రాలు సృష్టించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :