Hydra: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అక్రమ భూ ఆక్రమణలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందమైన హైడ్రా (HYDRA) తన దూకుడు కొనసాగిస్తోంది. ఇటీవలే మేడ్చల్ జిల్లా పరిధిలోని పోచారం మున్సిపాలిటీ (Pocharam Municipality) లో జరిగిన తాజా చర్యలతో మళ్లీ ఒకసారి ఈ బృందం వార్తల్లోకెక్కింది. ప్రభుత్వ భూములతో పాటు తప్పుడు పత్రాల ఆధారంగా ఆక్రమించబడిన ప్రైవేటు భూములపై కూడా హైడ్రా బృందం కఠిన చర్యలు చేపడుతోంది.

ఏకశిలా నగర్‌లో 7 ఎకరాల ప్రహరీ కూల్చివేత
తాజాగా కొర్రెముల గ్రామ పరిధిలోని ఏకశిలానగర్ లో సర్వే నెంబర్ 740, 741, 742 లలో 7.16 ఎకరాల భూమి తనదేనంటూ నూనె వెంకటనారాయణ అనే వ్యక్తి ప్రహరీ నిర్మించాడు. అయితే, తప్పుడు పత్రాలు సృష్టించి వ్యవసాయ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించారని ఏకశిల ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. రికార్డులు అన్నీ పరిశీలించాకే తాము ప్లాట్లు కొనుగోలు చేశామని చెప్పారు. తమకు న్యాయం చేయాలంటూ హైడ్రా కమిషనర్ ను ఆశ్రయించారు.
దివ్యానగర్ నుంచి ఏకశిల వరకు — హైడ్రా చర్యల వ్యవధి
ఇది మొదటిసారి కాదు. హైడ్రా బృందం ఇటీవల ఇటీవల దివ్యానగర్ ప్రాంతంలో కూడా భారీ ప్రహరీ కూల్చివేతలు చేపట్టింది. ఇప్పుడు అదే ధాటితో ఏకశిలా వెంచర్‌లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంది.
ప్రజా స్పందన
హైడ్రా అధికారుల వేగవంతమైన స్పందనతో హైడ్రా బృందం ఏకశిల వెంచర్లో 7 ఎకరాల చుట్టూ నిర్మించిన ప్రహరీని కూల్చివేసింది. హైడ్రా చర్యలతో ఏకశిలా ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
నూనె వెంకటనారాయణ వాదన:
రికార్డులు పరిశీలించకుండానే అధికారులు తమ వ్యవసాయ భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చివేశారని నూనె వెంకటనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
Read also: Employees: ఉద్యోగుల హాజరు నమోదుకు పకడ్బందీ చర్యలు