హైదరాబాదీ బిర్యానీ (HYD Biryani) కి మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసిన ‘వరల్డ్స్ బెస్ట్ రైస్ డిషెస్ లిస్ట్ ఆఫ్ 2025’లో హైదరాబాదీ బిర్యానీ టాప్ 10లో సగర్వంగా నిలిచింది. ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో 10వ స్థానాన్ని దక్కించుకుంది. అలాగే టాప్ 50లో చోటు సంపాదించిన ఏకైక భారతీయ వంటకం కూడా ఇదే కావడం గమనార్హం.
Read Also: Grama Panchayat Elections : తొలిరోజు నామినేషన్లు ఎన్నో తెలుసా?
మరో వంటకం ఇరాన్‌కు చెందినది
చెఫ్‌లు, ఫుడ్ క్రిటిక్స్ చేసిన సమీక్షలతో పాటుగా యాత్రికులు అందించిన రేటింగ్స్ ద్వారా హైదరాబాదీ బిర్యానీని టాప్10 రైస్ డిష్‌గా ఎంపిక చేశారు.కాగా టాప్ టెన్‌లో నిలిచిన జాబితాలో అధిక శాతం జపనీస్ వంటకాలే ఉండటం విశేషం. కాగా, టాప్ 10లో మొదటి మూడు డిషెస్ జపనీస్ వంటకాలే కావడం గమనార్హం.అవి నెగిటోరోడాన్, సుషీ, కైసెన్డాన్‌లు.
ఇక ఇండియాలో లక్నో, కశ్మీరీ, కోల్‌కతా.. విభిన్న ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక బిర్యానీలు ఉన్నప్పటికీ హైదరాబాదీ బిర్యానీ అగ్రగామిగా నిలవడం గమనార్హం. మరో విశేషమేమిటంటే టాప్ 50లో బిర్యానీ పేరిట నిలిచిన మరో వంటకం ఇరాన్‌కు చెందినది కావడం గమనార్హం. ఏదేమైనా అంతర్జాతీయ వేదికపై హైదరాబాదీ బిర్యానీ (HYD Biryani) తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: