Ponnam Prabhakar:పూరి గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని గృహకల్ప కార్యాలయంలో నాలుగు నియోజకవర్గాల పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల కోసం ఈ-లాటరీ ప్రక్రియను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ కోర్ ఏరియాలోని గోషామహల్, చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్, ముషీరాబాద్ నియోజకవర్గాల లబ్ధిదారులను ఈ లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, హౌసింగ్ ఎండీ గౌతమ్ సహా పలువురు ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఈ-లాటరీ ద్వారా ఇళ్లు దక్కించుకున్న లబ్ధిదారులకు మంత్రి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
Read also: Indiramma Towers Lottery: హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇండ్ల కోసం మరో డ్రా

ఉపాధి ఎక్కడ ఉంటే.. అక్కడే ఇల్లు
ప్రజా ప్రభుత్వ హయాంలో ప్రతి నియోజకవర్గానికి మొత్తం 5,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో మొదటి విడత కింద 3,500 ఇళ్లు, రెండో విడతలో 2,000 ఇళ్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మొదటి దశ ఇళ్ల నిర్మాణాలు చాలా వరకు పూర్తయ్యాయని, దశలవారీగా (ఫేజ్ మేనర్‌లో) లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఉపాధి ఒక ప్రాంతంలో ఉంటే, ఇళ్లు వేరే ప్రాంతంలో కేటాయించడం వల్ల లబ్ధిదారులు ఇబ్బంది పడేవారని గుర్తుచేశారు. ఆ పరిస్థితి మళ్లీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో.. ఉపాధి ఎక్కడ ఉంటే, అక్కడే ఇల్లు ఉండాలనే నిబంధనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
అర్హులైన పేదలందరికీ లబ్ధి
- గుడిసెలు లేని సమాజాన్ని ఆవిష్కరించాలనే ఉద్దేశంతో పార్టీలు, కులాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ ఇళ్లను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
- గతంలో ఇళ్ల నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన వారికి, కొత్తగా ఇల్లు లేని నిరుపేదలకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు.
- పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరత, నిర్మాణ వ్యత్యాసాల కారణంగా.. నియోజకవర్గాల్లో సొంత స్థలాలు ఉన్నవారికే అక్కడే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు వెల్లడించారు.
- హైదరాబాద్‌లో స్థలాలు అందుబాటులో లేని చోట, ప్రభుత్వం అత్యంత విలువైన స్థలాలను కేటాయించి అత్యాధునిక వసతులతో ఇళ్లను నిర్మించి ఇస్తోందని, త్వరలోనే వీటికి భూమిపూజ నిర్వహించనున్నట్లు తెలిపారు.
Ponnam Prabhakar:కొత్త పేర్ల నమోదుకు అవకాశం
రేషన్ కార్డులు లేని అర్హులైన పేదలకు కూడా ప్రభుత్వం తగిన వెసులుబాటు కల్పిస్తోందని, ఇల్లు లేని కొత్త వారు పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ‘ఎల్-1’ కింద సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే సుమారు 2 వేల మందికి కూడా త్వరలోనే ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామని, మహిళల కోసం సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్నామని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో మహిళా సంఘాల్లో సభ్యత్వాలు తక్కువగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ సంఘాల్లో చేరి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: