Indiramma Towers Lottery: హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇండ్ల కోసం మరో డ్రా

Follow Us: Google News Daily Hunt
An online lottery will be held on November 4 for the remaining vacant flats in the Hyderabad Indiramma Towers scheme. Khairatabad is reported to have the highest number of vacancies.
An online lottery will be held on November 4 for the remaining vacant flats in the Hyderabad Indiramma Towers scheme. Khairatabad is reported to have the highest number of vacancies.
FONT SIZE
GET APP

Indiramma Towers Lottery: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్‌లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పథకంలో మరోసారి లాటరీ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తొలి విడతలో ఫ్లాట్లు పొందిన వారిలో కొందరు ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో కేటాయింపులను వదులుకోవడంతో కొన్ని ఫ్లాట్లు ఖాళీగా మిగిలాయి. ఈ నేపథ్యంలో మిగిలిన ఫ్లాట్లకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు నవంబర్ 4న ఆన్‌లైన్ ద్వారా మరోసారి లాటరీ నిర్వహించనున్నారు.

Read Also:Electricity Consumption: చలికాలంలోను కరెంటు బిల్లుల మోత!

తొలి విడత కేటాయింపుల్లో ఖాళీలు

Indiramma Towers Lottery

ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపు కోసం అధికారులు తొలుత లాటరీ నిర్వహించి అర్హులను ఎంపిక చేశారు. ఒక్కో నియోజకవర్గంలో నిర్మించనున్న 480 ఫ్లాట్లకు సమాన సంఖ్యలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాత్రం 140 ఫ్లాట్లు కేటాయించనున్నారు. ఎంపికైన వారిలో కొందరు కేటాయింపులను వదులుకునే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేసిన అధికారులు.. ఒక్కో నియోజకవర్గానికి గరిష్ఠంగా మరో 120 మందిని వెయిటింగ్ లిస్టులో చేర్చారు. అయినప్పటికీ కొందరు లబ్ధిదారులు వెనక్కి తగ్గడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి అవకాశం కల్పించిన తర్వాత కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఫ్లాట్లు మిగిలిపోయాయి.

ఖాళీలకు కారణాలివే..

లాటరీలో ఫ్లాట్లు పొందినప్పటికీ కొందరు ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిర్ణీత సమయంలో తొలి వాయిదా చెల్లించలేకపోయారు. మరికొందరు వ్యక్తిగత, ఇతర కారణాలతో కేటాయింపులను వదులుకున్నారు. దీంతో వారికి కేటాయించిన ఫ్లాట్లు తిరిగి ఖాళీగా మిగిలాయి. ఇంకోవైపు, దరఖాస్తు సమయంలో నియోజకవర్గ వివరాలను తప్పుగా నమోదు చేసిన కొందరు లాటరీలో ఎంపికైనా వారి కేటాయింపులను అధికారులు పక్కనపెట్టారు. అయితే విచారణలో వారు అర్హులని తేలితే.. ప్రస్తుతం నివసిస్తున్న నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్‌లో వారికి ప్రాధాన్యం కల్పించే అంశాన్ని హౌసింగ్ బోర్డు పరిశీలిస్తోంది.

ఖైరతాబాద్‌లో అత్యధిక ఖాళీలు

ప్రస్తుతం ఖైరతాబాద్ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఫ్లాట్లు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. తొలుత అక్కడే ఎక్కువ ఫ్లాట్లకు రీ-లాటరీ అవసరమవుతుందని అధికారులు భావించినప్పటికీ, కేటాయింపుల ప్రక్రియ కొనసాగుతున్న కొద్దీ ఇతర నియోజకవర్గాల్లోనూ ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో దాదాపు అన్ని ఫ్లాట్లకు లబ్ధిదారులు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ ఒకరిద్దరు మాత్రమే చెల్లింపులు చేయాల్సి ఉన్నట్లు సమాచారం.

Indiramma Towers Lottery: నవంబర్ 4న ఆన్‌లైన్ లాటరీ

ఇప్పటికే వాయిదాలు చెల్లించిన లబ్ధిదారులు, ఇంకా ఖాళీగా ఉన్న ఫ్లాట్ల వివరాలను అధికారులు సేకరించారు. ఈ సమాచారాన్ని క్రోడీకరించి మిగిలిన ఫ్లాట్లకు అర్హులను ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం నవంబర్ 4న ఆన్‌లైన్ ద్వారా మరోసారి లాటరీ నిర్వహించేందుకు హౌసింగ్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఈ డ్రా ద్వారా ఖాళీగా ఉన్న ఫ్లాట్లకు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు