Hyderabad Water Supply: జలమండలి కీలక ప్రకటన.. నవంబర్ 3, 4 తేదీల్లో ఈ ప్రాంతాలకు నీళ్లు రావు!

Follow Us: Google News Daily Hunt
Due to repair works on the Gandipet conduit, water supply to several areas in Hyderabad will be interrupted for 36 hours on November 3rd and 4th. Here are the details of the affected areas.
Due to repair works on the Gandipet conduit, water supply to several areas in Hyderabad will be interrupted for 36 hours on November 3rd and 4th. Here are the details of the affected areas.
FONT SIZE
GET APP

Hyderabad Water Supply: హైదరాబాద్ నగరవాసులకు జలమండలి కీలక సూచనలు జారీ చేసింది. నగరానికి తాగునీటిని సరఫరా చేసే పురాతన కాండ్యూట్‌లో లీకేజీలను అరికట్టేందుకు మరమ్మతు పనులు చేపట్టనుంది. ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో 36 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. నవంబర్ 3వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 4వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటల వరకు ఈ పనులు కొనసాగనున్నాయి. ప్రభావిత ప్రాంతాల ప్రజలు ముందుగానే అవసరమైన నీటిని నిల్వ చేసుకోవాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.

Read Also:Indiramma towers: మరో 5 చోట్ల ఇందిరమ్మ టవర్స్

Hyderabad Water Supply

వందేళ్లకు పైగా పురాతన కాండ్యూట్‌లో లీకేజీలు

హైదరాబాద్ నగరానికి కృష్ణా, గోదావరి, సింగూరు–మంజీరా, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ తదితర జలవనరుల నుంచి జలమండలి ప్రతిరోజూ దాదాపు 560 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీ) తాగునీటిని సరఫరా చేస్తోంది. ఇందులో గండిపేట (ఉస్మాన్‌సాగర్) నుంచి నగరానికి నీటిని తీసుకొచ్చే 20 ఎంజీడీల సామర్థ్యం గల కాండ్యూట్ కీలకమైనది. వందేళ్లకు పైగా పురాతనమైన ఈ రాతి నిర్మాణంలో సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ ప్రాంతాల వద్ద లీకేజీలు గుర్తించారు. వాటిని అరికట్టడంతో పాటు నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు జలమండలి మరమ్మతులు చేపడుతోంది.

ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం

గండిపేట కాండ్యూట్‌పై చేపట్టే పనుల ప్రభావం కొన్ని ప్రాంతాలకే పరిమితం కానుంది. ప్రభావిత ప్రాంతాల వివరాలు ఇలా ఉన్నాయి.

గోషామహల్, కార్వాన్ సర్కిళ్లు (డివిజన్-13):

  • రెడ్‌హిల్స్, నాంపల్లి
  • మల్లేపల్లి, సీతారాంబాగ్
  • గోడేకీ ఖబర్, హిందీనగర్
  • అసెంబ్లీ, సెక్రటేరియట్
  • న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్‌నగర్
  • నాంపల్లి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రాంతం
  • గన్‌ఫౌండ్రీ

గోల్కొండ జోన్ (డివిజన్-14):

  • చింతల్ బస్తీ
  • విజయనగర్ కాలనీ
  • ఓల్డ్ మల్లేపల్లి
  • ఆసిఫ్‌నగర్
  • అహ్మద్‌నగర్

ఇతర ప్రాంతాలు:

  • కవాడిగూడ పరిధిలోని గాంధీనగర్ వార్డుల పరిధి, దోమలగూడ
  • జూబ్లీహిల్స్ పరిధిలోని బంజారాహిల్స్, ఇతర ప్రాంతాలు

Hyderabad Water Supply: నగరమంతా నీటి సరఫరా నిలిచిపోదు!

ఈ మరమ్మతుల కారణంగా గండిపేట నుంచి నీటిని సరఫరా చేసే 20 ఎంజీడీల కాండ్యూట్‌పై ఆధారపడిన ప్రాంతాల్లో మాత్రమే అంతరాయం ఏర్పడనుంది. నగరానికి ఇతర జలవనరుల నుంచి అందించే నీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుందని జలమండలి స్పష్టం చేసింది. సింగూరు–మంజీరా, కృష్ణా, గోదావరి తదితర వనరుల నుంచి నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని తెలిపింది. కాబట్టి ప్రభావిత ప్రాంతాల ప్రజలు నవంబర్ 3, 4 తేదీల్లో ఇబ్బందులు ఎదురుకాకుండా ముందుగానే నీటిని నిల్వ చేసుకోవాలి. అవసరానికి తగినంత నీటిని మాత్రమే వినియోగిస్తూ పొదుపు పాటించాలని జలమండలి సూచించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు