Sai Durga Tej: మెగా మేనల్లుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి, తన నటనతో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్) త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చాలా కాలంగా ఆయన వివాహం గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో, తాజాగా ఆయన పెళ్లి ముహూర్తం ఖరారైందంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. దీంతో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
Read Also : Imran Khan: మీకు నిరసన తెలిపే హక్కు లేదు.. ఇమ్రాన్ ఖాన్‌పై బాంబే హైకోర్ట్ ఫైర్

Sai Durga Tej: హైదరాబాద్‌లో నవంబర్ 5న నిశ్చితార్థం?
సమాచారం ప్రకారం, మెగా కుటుంబంలో మరో పెళ్లి వేడుకకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవంబర్ 5వ తేదీన హైదరాబాద్ వేదికగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం (Engagement) చాలా నిరాడంబరంగా జరగనున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, ఆయన వివాహం చేసుకోబోయే అమ్మాయి ఎవరు, ఆమె నేపథ్యం ఏమిటి అనే విషయాలను ఇరు కుటుంబాలు అత్యంత గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 10న వివాహం.. ఆ తర్వాత గ్రాండ్ రిసెప్షన్!
ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తల ప్రకారం, డిసెంబర్ 10న సాయి దుర్గా తేజ్ వివాహ మహోత్సవం జరగనుంది. పెళ్లి వేడుక ముగిసిన అనంతరం సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, శ్రేయోభిలాషుల కోసం హైదరాబాద్‌లో భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం సాయి తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’ అనే ప్రాజెక్ట్ షూటింగ్‌లో పూర్తి బిజీగా ఉన్నారు. కాగా, ఈ పెళ్లి వార్తలపై సాయి దుర్గా తేజ్ నుంచి గానీ, లేదా మెగా కుటుంబ సభ్యుల నుంచి గానీ అధికారిక ప్రకటన వెలువడితేనే ఈ వార్తలపై పూర్తి స్పష్టత రానుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :