మూడురోజులైనా దొరకని ముగ్గురి ఆచూకీ
ఇటీవల హైదరాబాద్లో (Hyderabad) కురిసిన భారీ వర్షాలకు వరదల్లో గల్లంతైన ముగ్గురి వ్యక్తుల ఆచూకీ ఇంకా దొరకలేదు. మల్లేపల్లి,అఫ్ఘల్ సాగర్ కాలనీ (Afghal Sagar Colony) లో నవాసం ఉండే అర్జున్, రాము వరుసకు మామ, అల్లుళ్లు. రోజులాగే ఇంటి బయట మంచాలపై,పడుకున్న రాము, అర్జున్ లు ఆకస్మాత్తుగా వచ్చిన వరద వల్ల నాలాలో పడిపోయి గల్లంతైయ్యారు. రాముకు, అర్జున్ లకు,నలుగురు నలుగురు పిల్లలున్నారు.
ఇక ముషీరాబాద్ (Musheerabad) లోని వినోబానగర్ ప్రాంతానికి చెందిన దినేష్ ఒక అనాధ యువతిని,ప్రేమ వివాహం చేసుకోగా వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నారు. దినేష్ స్నేహితుడి ఇంటి దగ్గరకి వెళ్లి, బైకు పార్క్ (Bike park) చేస్తుండగా నాలా గోడ కూలి వరదలో కొట్టుకుపోయాడు. కొడుకు తిరిగొస్తాడనే నమ్మకంతో వరదలో కొట్టుకుపోయిన విషయం కోడలికి చెప్పలేదు దినేష్ తల్లిదండ్రులు.

ఆచూకీ కనిపెట్టేందుకు కష్టంగా మారింది
అయితే చానెళ్లులో వస్తున్న వార్తల్ని తెలుసుకుని గుండెలవిసేలా రోదిస్తున్నది. వీరి ఆవేదన అంతాఇంతా కాదు. కనీసం తమవారిని చివరిచూపుకైనా నోచుకోలేకపోతున్నామని, వారు బతికున్నారా లేక మరణించారో,తెలియని అయోమయంలో రోదిస్తున్నారు.కొనసాగుతున్న అన్వేషణ,కాగా గత మూడురోజులుగా హైడ్రా, జీహెచ్ఎంసి (GHMC) గల్లంతైన వారికోసం అన్వేషిస్తూనే ఉన్నారు.
నిన్నరాత్రి మళ్లీ హైదరాబాద్ లో,భారీ వర్షం కురవడంతో నాలాల్లోకి వరద నీరు విపరీతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆచూకీ కనిపెట్టేందుకు కష్టంగా మారింది.కుటుంబ సభ్యులు తమవారి కోసం నిద్రాహారాలు మాని ఎదురుచూస్తున్నారు. వారు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. వారు క్షేమంగా దొరకాలని మనం కూడా ఆశిద్దాం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: