బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తెలంగాణ మీద తీవ్రంగా పడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరం వర్షబీభత్సంతో అతలాకుతలం అయింది.
హైదరాబాద్ వర్షంలో తడిసిముద్ద
నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట(Ameerpet), ఖైరతాబాద్, ఎల్బీనగర్, పెద్ద అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.

మోకాలి లోతు వరకూ నీరు – ట్రాఫిక్‌కు బ్రేకులు
ఖైరతాబాద్ – రాజ్ భవన్ రోడ్డులో మోకాలి లోతు వరకూ నీరు చేరింది. వాహనదారులు గమ్యస్థానాలకు చేరడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట వంటి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.
GHMC & హైడ్రా బృందాల సహాయక చర్యలు
వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ (GHMC)మరియు హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి. రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు శ్రమిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
వాతావరణ శాఖ హెచ్చరికలు
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో వచ్చే రెండు రోజుల పాటు, అంటే సోమవారం మరియు మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనిపై ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది.
ప్రజలకు సూచనలు
ప్రజలు అవసరం లేనప్పుడు బయటకు వెళ్లకూడదని, పాత భవనాల్లో నివసిస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే మాత్రమే ప్రయాణించాలని ట్రాఫిక్ శాఖ తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: