హైదరాబాద్ నగరంలో రాత్రి వాన విలయతాండవం సృష్టించింది. ఒక్కసారిగా కృష్ణ మేఘాలు దూసుకొచ్చి, నగరాన్ని ధారాళంగా ముంచాయి. క్లౌడ్ బర్స్ట్ (Cloud burst) జరిగినట్లే ఆకాశం నుంచి వచ్చిన వర్షానికి నగరమంతా జలమయం అయ్యింది. పలు ప్రాంతాల్లో లోతట్టు కాలనీలు నీటిలో మునిగిపోవడం, ట్రాఫిక్ స్తంభించడం, వాహనదారుల ఇబ్బందులు తీవ్రంగా ఎదురయ్యాయి.
నిమిషాల్లోనే చెరువుల్లా మారిన రహదారులు
వర్షం ప్రారంభమైన కొద్దిసేపటికే రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్డుపైకి నీరు చేరింది. మాన్హోల్స్ ఓపెన్ అవ్వడంతో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. GHMC మరియు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని నియంత్రించడానికి చర్యలు చేపట్టారు. ప్రజలకు మ్యాన్‌హోల్స్ దగ్గర అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్రాఫిక్ అష్టకష్టాలు – వాహనదారుల నరకయాత్ర
కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ నిలిచిపోయింది. నడకలేక, వాహనాల్లో కూర్చోలేక ప్రజలు నరకం అనుభవించారు. ముఖ్యంగా ప్రధాన రహదారులపై వాహనాలు పూర్తిగా కదలకుండా నిలిచిపోయాయి. GHMC మాన్సూన్ టీమ్‌లు, ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ సమన్వయంతో రోడ్లపై నీటిని తొలగించే ప్రయత్నాలు చేపట్టాయి.
ఎస్‌ఆర్ నగర్‌లో విషాదం – వర్షపు నీటిలో ప్రాణనష్టం
వర్షం మరింత విషాదాన్ని తెచ్చింది. ఎస్‌ఆర్ నగర్ (SR nagar) బల్కంపేట్ రైల్వే బ్రిడ్జి వద్ద ఓ వాహనదారుడు వర్షపు నీటిలో పడి మరణించాడు. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోవడం, డ్రెయిన్ వ్యవస్థల పరాజయం ఈ ప్రమాదాలకు దారితీసింది. అధికారులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
అంబర్‌పేట, మెట్టుగూడలో వరద బీభత్సం
అంబర్‌పేటలో భారీ వర్షం వల్ల వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ప్రజలు తమ బైకులు, కార్లను రక్షించేందుకు తీవ్రంగా శ్రమించారు. మెట్టుగూడలో పలు కాలనీలు పూర్తిగా మునిగిపోయాయి. ఇంట్లోకి నీరు ప్రవేశించి ప్రజలు రాత్రంతా ఇబ్బందులు పడ్డారు. చిక్కడపల్లిలోనూ ఇదే పరిస్థితి కనిపించింది.
మియాపూర్, గంగారాం హైవే – అపార్ట్‌మెంట్లు నీటమునిగినవి
మియాపూర్ ప్రాంతంలో పలు అపార్ట్‌మెంట్ల సెల్లార్లలో వరద నీరు చేరింది. కార్లు, టూవీలర్లు నీటిలో మునిగి ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. గంగారం నేషనల్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వాహనాలు చెరువులో నిలిచినట్లు కనిపించాయి.
డ్రైనేజీలు పొంగిన ఆసిఫ్‌నగర్ – మేయర్ పర్యటన
ఆసిఫ్‌నగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ విఫలమై, నీళ్లు రోడ్డుపైకి వచ్చాయి. మాసబ్‌ట్యాంక్‌లో మేయర్ విజయలక్ష్మి పర్యటించి, లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లక్డీకాపూల్, ఖైరతాబాద్, చింతలబస్తీ, లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో పరిస్థితి విషమంగా ఉంది.
రెయిన్‌ఫాల్ గణాంకాలు
వర్షపాతం గణాంకాల ప్రకారం:
- ముషీరాబాద్: 18.4 మి.మీ
- చిలకలగూడ: 14.7 మి.మీ
- మోండా మార్కెట్: 14.6 మి.మీ
- హెచ్‌సీయూ: 14.4 మి.మీ
- బేగంపేట్: 13.5 మి.మీ
- లింగంపల్లి: 13 మి.మీ
- ఖైరతాబాద్: 12.5 మి.మీ
- శ్రీనగర్ కాలనీ: 11.1 మి.మీ
ఇంకా పలుచోట్ల 8 మి.మీ పైగా వర్షం నమోదైంది.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు – అధికారుల అప్రమత్తత కీలకం
నగరంలో తలెత్తిన పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా ట్రాఫిక్, హైడ్రా, పోలీస్ శాఖలు వెంటనే స్పందించాలని స్పష్టం చేశారు.
ప్రజలు వర్ష సమయంలో మిగిలిన రోడ్లకు వెళ్లకుండా, లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మ్యాన్‌హోల్స్ సమీపంలో జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ కోతలు వచ్చిన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: