हिन्दी | Epaper

Hyderabad: న్యూ ఇయర్.. న‌టి శ్యామలను పరామర్శించిన సజ్జనార్

Saritha
Hyderabad: న్యూ ఇయర్.. న‌టి శ్యామలను పరామర్శించిన సజ్జనార్

నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ వి.సి. సజ్జనర్(V.C. Sajjanar) సేవా కార్యక్రమాలతో తన ఏడాదిని ప్రారంభించారు. (Hyderabad) కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఆయన, అక్కడి వృద్ధులతో సమయాన్ని గడిపారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, వారితో కలిసి కొత్త ఏడాది వేడుకలను జరుపుకున్నారు. వృద్ధాశ్రమాన్ని సందర్శించి అక్కడున్న 48 మంది వృద్ధుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

Read also: NEW YEAR 2026: ఆల్కహాల్ రీడింగ్ చూసి పోలీసులు అవాక్కు

Hyderabad: న్యూ ఇయర్.. న‌టి శ్యామలను పరామర్శించిన సజ్జనార్

ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో సజ్జనార్ సందర్శన

అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి పావలా శ్యామలను కూడా ఆయన పరామర్శించారు. కొత్త సంవత్సరం సందర్భంగా తాను కార్ఖానలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని సందర్శించినట్లు ‘ఎక్స్’ వేదికగా సజ్జనార్ తెలిపారు. (Hyderabad) నూతన సంవత్సర వేడుకలంటే కేవలం సంబరాలు, హంగులే కాదు. ఆత్మీయతను పంచుకోవడం, బాధ్యతను గుర్తుచేసుకోవడం. ఇదే సంకల్పంతో ఈ ఏడాది తొలి రోజును నిరాడంబరంగా, సేవా దృక్పథంతో ప్రారంభించాను. అని ఆయన పేర్కొన్నారు. అక్కడే అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి పావలా శ్యామలను పరామర్శించినట్లు తెలిపారు. పావలా శ్యామల కష్టకాలంలో స్పందించి ఆమెను హెల్త్ కేర్ సెంటర్‌లో చేర్పించారంటూ తిరుమలగిరి ఏసీపీ రమేశ్‌ను అభినందించారు. ఆర్కే ఫౌండేషన్ గురించి మాట్లాడుతూ, డాక్టర్ రామకృష్ణ 18 ఏళ్లుగా వేలాదిమందికి ఉచిత వైద్యం, ఆశ్రయం కల్పిస్తున్నారని, ఆయన సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వృద్ధాశ్రమాలు లేని సమాజం రావాలని, తల్లిదండ్రులను భారంగా కాకుండా బాధ్యతగా చూసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్
0:52

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్

📢 For Advertisement Booking: 98481 12870