Hyderabad Metro : మహిళా ప్రయాణికుల భద్రతను మరింత బలపరిచే దిశగా హైదరాబాద్ మెట్రో రైల్ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా సిబ్బందిలో భాగంగా 20 మంది ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను నియమిస్తూ ముందడుగు వేసింది. ఈ చర్యతో మెట్రో ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, ఆహ్లాదకరంగా మార్చాలన్నదే లక్ష్యంగా అధికారులు తెలిపారు.
హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే వారిలో సుమారు 30 శాతం మంది మహిళలే కావడంతో, వారి భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా నియమితులైన ట్రాన్స్‌జెండర్ సిబ్బంది భద్రతా శిక్షణ పూర్తిచేసుకుని, ఎంపిక చేసిన స్టేషన్లు మరియు మెట్రో రైళ్లలో విధులు నిర్వహించనున్నారు.
Read also: Nara Lokesh : ఢిల్లీకి మంత్రి లోకేశ్.. రేపు కేంద్ర మంత్రులతో భేటీ
వీరి బాధ్యతల్లో మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి, ప్రయాణికులకు మార్గనిర్దేశం, సమాచారం ఇవ్వడం, బ్యాగేజీ స్కానర్‌ల పర్యవేక్షణ, కాంకోర్స్ ప్రాంతం మరియు స్ట్రీట్ లెవల్‌లో భద్రత వ్యవస్థలను పర్యవేక్షించడం వంటి అంశాలు ఉంటాయి. (Hyderabad Metro) ఈ చర్య సమాజంతో పాటు భద్రతకు సమాన ప్రాధాన్యం ఇస్తున్న హైదరాబాద్ మెట్రో నిబద్ధతకు నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/