Hyderabad : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్ తో పాటు శివార్లలో కలిపి వున్న మూడు పోలీసు కమిషనరేట్ల స్థానంలో నాలుగు కమిషనరేట్లను ఏర్పాటు చేసిన సర్కారు తాజాగా ఇందులో కొత్తగా ఏర్పాటైన జోన్లకు డిసిపిలను బుధవారం రాత్రి నియమించింది. సిద్దిపేట్ పోలీస్ కమిషనర్గా వున్న విజయ్ కుమార్ను బదిలీ చేసి హైదరాబాద్లో స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ నియమించారు. ఆయన స్థానంలో ఉత్తర మండల డిసిపిగా వున్న రేష్మీ పెరుమాళ్ను బదిలీ చేశారు.
Read Also: Medak: అంధ ఉద్యోగులను సన్మానిస్తున్న జిల్లా కలెక్టర్
సైబరాబాద్లో(Cyberabad) కొత్తగా ఏర్పాటైన శేరిలింగంపల్లి జోన్ డిసిపిగా సిహెచ్ శ్రీనివాస్ను నియమించగా, చేవెళ్ల జోన్ డిసిపిగా యోగేష్ గౌతంను నియమించారు. కూకట్పల్లి డిసిపిగా రితిరాజ్ను బదిలీ చేయగా రాజేంద్రనగర్ డిసిపిగా ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ శ్రీనివాస్ ను నియమించారు. మల్కాజిగిరి కమిషనేట్ పరిధిలో కొత్తగా ఏర్పాటైన బేగంపేట్ డిసిపిగా రక్షిత మూర్తిని నియమించారు. నగర జాయింట్ పోలీస్ కమిషనర్గా ఉన్న తఫ్సీర్ ఇక్బాల్ను బదిలీ చేసి సౌత్ జోన్(శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్, చార్మినార్ జోన్లు) అదనపు కమిషనర్గా నియమించారు.

నగరంలో డిప్యూటీ కమిషనర్గా ఉన్న ఎన్. స్వేతను బదిలీ చేసినార్త జోన్ (జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్స్) జాయిం ట్ కమిషనర్ గా నియమించారు. మెడ్చేల్ జోన్ డిసిపిగా ఉన్న ఎన్.కోటీ రెడ్డిని బదిలీ చేసి కుత్బుల్లాపూర్ డిసిపిగా నియమించారు. మహేశ్వరం జోన్ డిసిపిగా ఉన్న కె. నారాయణరెడ్డి బదిలీ చేసి ఫ్యూచర్ సిటీలో డిసిసిగా నియమించారు. బాలానగర్ డిసిపిగా ఉన్న కె.సురేశ్ కుమార్ను ఉప్పల్ జోన్ డిసిపిగా నియించారు. సౌత్ జోన్లో ఉన్న కెకె ప్రభాకర్ను చార్మినాల్ డిసిపిగా బదిలీ చేశారు.
మాదాపూర్ డిసిపిగా ఉన్న రిత్రారాజ్ను బదిలీ చేసి కూకట్పల్లి డిసిపిగా నియమించారు. డిసిపి శిల్పవల్లి సెంట్రల్ జోన్ నుంచి ఖైరతాబాద్కు బదిలీ అయ్యారు. ట్రాన్స్కోలో ఎస్పీగా ఉన్న ఎస్. శ్రీనివాస్ రాజేంద్రనగర్ డిసిపిగా బదిలీ అయ్యారు. సౌత్ వెస్ట్ డిసిపిగా ఉన్న జి.చంద్రమోహన్ గోల్కొండ జోన్కు బదిలీ అయ్యారు. రాచకొండలో ఉన్న డిసిపి ఎ.రమణారెడ్డి శంషాబాద్ జోన్కు బదిలీ అయ్యారు. ఇంటెలిజెన్స్ ఎస్పీగా సిహెచ్, సిరీశ శాద్నగర్కు డిసిపిగా బదిలీ అయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: