Koti Firing Case: హైదరాబాద్ కోఠి బ్యాంక్ స్ట్రీట్ కాల్పుల కేసులో నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. దోపిడీ అనంతరం నిందితులు పారిపోయిన మార్గాన్ని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు.
Read Also: Phone Tapping Case : ఫామ్ హౌస్లో విచారణకు సిట్ నో చెప్పడానికి కారణాలివే!

స్కూటీపై కాచిగూడ రైల్వే స్టేషన్‌కు
నిందితులు కోఠి నుంచి బాధితుడి స్కూటీపై కాచిగూడ రైల్వే స్టేషన్ (Kacheguda Railway Station) కు చేరుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అక్కడ స్కూటీని వదిలేసిన దుండగులు, స్టేషన్ లోపలికి వెళ్లి కాసేపటి తర్వాత తిరిగి బయటకు వచ్చారు. అనంతరం స్టేషన్ వద్ద ఒక ఆటో ఎక్కి సికింద్రాబాద్ వైపు వెళ్లినట్లు గుర్తించారు.
నిందితులు ప్రయాణించిన ఆటోను గుర్తించిన పోలీసులు, ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారు ఎక్కడ దిగారు? వారి వద్ద ఏముంది? అనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. నిందితులు రాష్ట్రం దాటకుండా రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద ప్రత్యేక నిఘా ఉంచారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: