దసరా పండుగ వేళ (అక్టోబర్ 2) హైదరాబాద్ (Hyderabad) లో మాంసం, మద్యం బంద్ కానుంది. అదే రోజున గాంధీ (Gandhi) జయంతి రావడంతో వీటిపై నిషేధం ఉండనుంది. ఆ రోజున నగరవ్యాప్తంగా మాంసం విక్రయాలపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) పరిధిలోని అన్ని రిటైల్ మాంసం దుకాణాలు, చికెన్ (Chicken)సెంటర్లు, స్లాటర్ హౌస్‌లను (కబేళాలు) అక్టోబర్ 2న తప్పనిసరిగా మూసి ఉంచాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

విప్లవం’ పోస్ట్ తో తమిళనాడులో పెనుదుమారం
ఉత్తర్వులను కఠినంగా అమలు
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ నిబంధనను పాటిస్తున్నట్లు కమిషనర్ తన ప్రకటనలో గుర్తుచేశారు. జీహెచ్ఎంసీ చట్టం 1955, సెక్షన్ 533B కింద స్టాండింగ్ కమిటీ చేసిన తీర్మానం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సాధారణంగా దసరా పండుగ రోజు మాంసం అమ్మకాలు అత్యధికంగా ఉంటాయి. ఈసారి గాంధీ జయంతి కారణంగా దుకాణాలు మూసివేయాలన్న ఆదేశాలు రావడంతో విక్రయదారులు ఆందోళన చెందుతున్నారు. పండుగ సీజన్‌లో వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు వాపోతున్నారు. దీంతో మాంసం ప్రియులు దసరా వేడుకల కోసం ఒకరోజు ముందుగానే మాంసం కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: