తెలంగాణ: హైదరాబాద్(Hyderabad Crime) నాచారం పరిధిలో సంచలనాత్మక హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటిని అద్దెకు తీసుకున్న ఓ క్యాబ్ డ్రైవర్, బంగారం దోచుకునే ఉద్దేశంతో ఇంటి యజమానురాలిని హత్య(murder) చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: iBOMMA: కేసులో సంచలనం.. నకిలీ పాన్, లైసెన్స్ వెలుగులోకి

క్యాబ్ డ్రైవర్, స్నేహితులు అరెస్ట్
పోలీసుల సమాచారం ప్రకారం, మల్లాపూర్ బాబానగర్‌కు చెందిన సూరెడ్డి సుజాత (65) తన నివాసంలో అద్దెదారుడిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎం. అంజిబాబు (33)కు ఇల్లు ఇచ్చింది. ఈ నెల 19న నిందితుడు సుజాతపై దాడి చేసి ఆమెను హత్య చేసిన అనంతరం, ఆమె శరీరంపై ఉన్న సుమారు 11 తులాల బంగారు ఆభరణాలను దోచుకున్నాడు.
హత్య అనంతరం ఆధారాలు మాయం చేయాలనే ఉద్దేశంతో అంజిబాబు తన స్నేహితుల సహకారంతో మృతదేహాన్ని(dead body) కారులో తరలించి గోదావరి నదిలో పడేశాడని పోలీసులు తెలిపారు. సుజాత అదృశ్యమైందని అనుమానించిన ఆమె చెల్లెలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది. విచారణలో నిజాలు వెలుగులోకి రావడంతో నిందితుడితో పాటు సహకరించిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: