2014–2022 మధ్య ఆర్థిక లావాదేవీలపై అనుమానాలు
జనరల్ బాడీ నిర్ణయం మేరకే హైదరాబాద్ బుక్ ఫెయిర్(Hyderabad Book Fair) గత కార్యవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారుల సభ్యత్వాలను తాత్కాలికంగా నిలిపివేయటం జరిగిందని హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రస్తుత అధ్యక్షులు కవి యాకుబ్, ప్రధాన కార్యదర్శి ఆర్. వాసు, ఉపాధ్యక్షులు బాలురెడ్డిలు స్పష్టం చేశారు. ఆదివారం బుకెఫెయిర్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతిష్టాత్మక హైదరాబాద్ బుక్ఫెయిర్ ఆర్థిక వ్యవహారాల్లో 2014 నుంచి 2022 వరకు భారీ అక్రమాలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీనిపై గత కార్యవర్గం స్పష్టత నివ్వాలని డిమాండ్ చేశారు.
Read Also: Bollaram: హైదరాబాద్‌లో రాజకీయ ప్రముఖులతో రాష్ట్రపతి ఎట్ హోం వేడుక
1986 నుంచి కాచిగూడలో బీఓఐలో అధికారిక ఖాతా ఉండగా రిజిస్ట్రేషన్ లేకుండానే ది హైదరాబాద్ బుక్ ఫెయిర్ పేరుతో 2021లో ఐసీఐసీఐ బ్యాంక్లో(ICICI Bank), 2016లో ఎస్బీఐలో కొత్త ఖాతాలు ఎందుకు తెరవవలసి వచ్చిందని ప్రశ్నించారు. ఈ ఖాతాల నుంచి భారీ మొత్తంలో కన్వెన్షన్ సెంటర్కు చెల్లించటం, లక్షలల్లో డబ్బు ఉపసంహరణలు చేయటం, గతంలో నిర్వహించిన 8 ప్రదర్శనలకు సంబంధించి టిక్కెట్ల విక్రయాలు, ఫుడ్ స్టాల్స్ నుంచి వచ్చిన ఆదాయం బ్యాంకుల్లో ఎందుకు జమ కాలేదని నిలదీశారు. నిధుల దుర్వినియోగంపై మూడు సార్లు నోటీసులు ఇచ్చినా గత బాద్యులు స్పందించటలేదని, అందుకే జనరల్ బాడీ నిర్ణయం మేరకు వారి సభ్యత్వాలు తాత్కాలికంగా రద్దు చేసి, బ్లాక్స్లో పెట్టటం జరిగిందని తెలిపారు.

ఐటీ రిటర్న్స్, క్యాష్‌బుక్ లేవు, బుక్ ఫెయిర్‌లో తీవ్ర ఆరోపణలు
పదేళ్ల కాలంలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదని, క్యాష్బుక్(Cashbook), వోచర్లు(Vouchers) కూడా నూతన కార్యవర్గంకు అప్పగించలేదని మండిపడ్డారు. జిల్లాల్లో ప్రభుత్వం ఇచ్చిన ఆర్ధిక సహాయం బ్యాంకు రికార్డుల్లో కనిపించటం లేదని, కొత్త కార్యదర్శి ఎన్నికయినప్పటికీ పాత వారే సిగ్నేటరీలుగా కొనసాగటం ఆర్ధిక నేరం కింద పరిగణించబడుతుందని అన్నారు. బుక్ ఫెయిర్ కార్యాలయాన్ని గత అధ్యక్ష కార్యదర్శులు తమ సొంత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలపై వివరణ ఇవ్వాలని గత కమిటీ బాధ్యులైన జూలూరి గౌరీ శంకర్, కోయ దంద్రమోహన్, పి. రాజేశ్వం రావులకు మూడుసార్లు లేఖరుల రాసినా స్పందించకపోగా, ఎదురు సమాజిక మాధ్యమాలలో ప్రస్తుత కమిటీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వంమెత్తారు. గత కమిటీ బాద్యులు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకుని అన్ని అనుమానాలను నివృత్తి చేయాలని, అన్ని రికార్డులను నూతన కమిటీకి అప్పగించాలని సూచించారు.
ఇన్ని అనుమానాల నేపథ్యంలో కోయ చంద్రమోహన్కు చెందిన తెలంగాణ పబ్లికేషన్స్కు స్టాల్ (Telangana Publications stall) కేటాయించకపోవటం అప్రజాస్వామ్యం ప్రచారం చేయటం, అంటూ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బుక్ఫెయిర్ అధ్యక్షుడు, కవి యాకూబ్, ప్రధాన కార్యదర్శి ఆర్. వాసు, ఉపాధ్యక్షుడు బాల్రెడ్డి తెలంగాణపై వివక్ష అంటూ వ్యాఖ్యలు చేయటం హాస్యా స్పదమని, బుకెఫెయిర్లో అన్ని ప్రాంగణాలకు తెలంగాణ కవులు, సాహితీ వేత్తల పేర్లు పెట్టి, తెలంగాణకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. ఇప్పటికైనా గత కార్యవర్గం తమ ప్రశ్నలకు సమాధానం చెప్పి, నిజాయితీ నిరూపించుకుంటే, వారికి స్టాల్ ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: