గగనవిహారాల ప్రేమికులకు కన్నుల పండుగగా నిలిచే హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నగరవాసులను విశేషంగా ఆకర్షిస్తోంది.గోల్కొండ కోట పక్కన ఉన్న ది హైదరాబాద్ (HYD) గోల్ఫ్ క్లబ్ గ్రౌండ్స్‌లో ఈ ఉత్సవం ఈ ఉదయం 7 గంటలకు ఘనంగా మొదలైంది. సినీ, ఇంటర్నెట్ మాధ్యమాలలో మాత్రమే చూసిన భారీ హాట్ ఎయిర్ బెలూన్‌లు ప్రత్యక్షంగా నగరవాసులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
పలువురు ప్రముఖులు హాట్ ఎయిర్ బెలూన్‌లలో తొలి ప్రయాణాన్ని ఆస్వాదించారు
రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు హాట్ ఎయిర్ బెలూన్‌లలో తొలి ప్రయాణాన్ని ఆస్వాదించారు. ఈ హాట్ ఎయిర్ బెలూన్ షో మూడు రోజుల పాటు కొనసాగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గోల్కొండ సమీపంలో ఈ బెలూన్ విన్యాసాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.








Pics by S.Sridhar